పుట్టినరోజున నీలం బంగారం చిలుకను దత్తత తీసుకున్న చిన్నారి

దిశ, చార్మినార్: హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక గురుజాల సంహిత తన తల్లి నవ్యదారంతో కలిసి శనివారం నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించారు. ఈ సంరద్భంగా జూలో ఉన్న పక్షులు, జంతువులను చూసి సంహిత ఆకర్షితురాలైంది. ఈ క్రమంలో నీలం బంగారం చిలుక (బ్లూగోల్డ్ మకా)ను దత్తతీసుకోవడానికి ఆసక్తి కనబరచారు. వాటి ఆరు నెలల పోషణకు అవసరమయ్యే ఖర్చును సంహిత ఎనిమిదవ జన్మదినం కోసం దాచుకున్న రూ.15 వేల చెక్కును సంహిత తల్లి జూ డిప్యూటీ క్యూరేటర్ […]

Update: 2021-11-13 09:30 GMT

దిశ, చార్మినార్: హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక గురుజాల సంహిత తన తల్లి నవ్యదారంతో కలిసి శనివారం నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించారు. ఈ సంరద్భంగా జూలో ఉన్న పక్షులు, జంతువులను చూసి సంహిత ఆకర్షితురాలైంది. ఈ క్రమంలో నీలం బంగారం చిలుక (బ్లూగోల్డ్ మకా)ను దత్తతీసుకోవడానికి ఆసక్తి కనబరచారు. వాటి ఆరు నెలల పోషణకు అవసరమయ్యే ఖర్చును సంహిత ఎనిమిదవ జన్మదినం కోసం దాచుకున్న రూ.15 వేల చెక్కును సంహిత తల్లి జూ డిప్యూటీ క్యూరేటర్ నాగమణికి అందజేశారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ.. నీలం బంగారం చిలుకను దత్తత తీసుకోవడానికి ఆసక్తి కనబరచిన సంహితకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తల్లి నవ్యదారం మాట్లాడుతూ.. సంహిత ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా దాచిన డబ్బుతో ఆరు నెలల పాటు బ్లూగోల్డ్ మకాను దత్తత తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.

Tags:    

Similar News