రాష్ట్రాలకు అదనంగా 60 లక్షలు వ్యాక్సిన్ డోసులు

న్యూఢిల్లీ: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా సుమారు 60లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించనున్నట్టు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు మీడియాకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 16,54,93,410 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్టు తెలిపింది. వాటిలో 15,79,21,537( వ్యాక్సిన్ వేస్టేజ్‌తో కలిపి) వ్యాక్సిన్‌లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వినియోగించాయని వెల్లడించింది. ప్రస్తుతం 75,71,873 వ్యాక్సిన్లు […]

Update: 2021-05-03 02:54 GMT

న్యూఢిల్లీ: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా సుమారు 60లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించనున్నట్టు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు మీడియాకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 16,54,93,410 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్టు తెలిపింది. వాటిలో 15,79,21,537( వ్యాక్సిన్ వేస్టేజ్‌తో కలిపి) వ్యాక్సిన్‌లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వినియోగించాయని వెల్లడించింది. ప్రస్తుతం 75,71,873 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. వీటికి అదనంగా 59,70,670 వ్యాక్సిన్ డోసులు మూడు రోజుల్లో రాష్ట్రాలకు అందుతాయని పేర్కొంది.

Tags:    

Similar News