కొవిషీల్డ్ డోసుల గడువుపై కేంద్రం క్లారిటీ..
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచే నిర్ణయం శాస్త్రీయ సమాచారం ఆధారంగానే తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అది పారదర్శకమైన నిర్ణయమని వివరించింది. సమాచారాన్ని వేగంగా నిర్ధారించే మెకానిజం భారత్ సొంతమని, ఇలాంటి విషయాలనూ రాజకీయం చేయడం బాధాకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను రెట్టింపు చేయడంపై కొంత విమర్శనాత్మక చర్చ జరిగింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ […]
న్యూఢిల్లీ: కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచే నిర్ణయం శాస్త్రీయ సమాచారం ఆధారంగానే తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అది పారదర్శకమైన నిర్ణయమని వివరించింది. సమాచారాన్ని వేగంగా నిర్ధారించే మెకానిజం భారత్ సొంతమని, ఇలాంటి విషయాలనూ రాజకీయం చేయడం బాధాకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను రెట్టింపు చేయడంపై కొంత విమర్శనాత్మక చర్చ జరిగింది.
నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్‌టీఏజీఐ)తో విభేదించి ఈ నిర్ణయం తీసుకున్నదన్న కథనాలు వాటికి ఆజ్యం పోశాయి. ఎడం పెంపు సిఫారసులు చేయడానికి సరిపడా శాస్త్రీయ డేటా లేదని ఎన్‌టీఏజీఐ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. తాజాగా, డోసుల వ్యవధి పెంపు నిర్ణయం శాస్త్రీయ డేటా ఆధారంగానే తీసుకున్నామని ఎన్‌టీఏజీఐ చైర్మన్ ఎన్‌కే అరోరా తెలిపారు. శాస్త్రజ్ఞుల్లోనూ భిన్నాభిప్రాయాలేమీ లేవని కొట్టిపారేశారు. యూకేలోనూ గడువు పెంపుతో ఎఫికసీ పెరిగిందని, అందుకే ఇక్కడా అలాంటి నిర్ణయమే తీసుకున్నామని వివరించారు. డోసుల మధ్య గ్యాప్ తగ్గించడంపై స్పందిస్తూ సైంటిఫిక్ డేటా సూచిస్తే తగ్గించడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.