రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు.. ఇకపై సెలవుల్లేవ్
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి కరోనా వ్యాక్సిన్ అందరికీ పంపిణీ చేయడమే మార్గమని నిపుణులు సూచిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో.. ఈ నెల మొత్తం అర్హులైన వారికి టీకాలు వేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్ నెలలో ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు, హాలీడేస్ వంటివి లేకుండా నెలమొత్తం కొవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుందని తెలిపింది. ఆ మేరకు […]
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి కరోనా వ్యాక్సిన్ అందరికీ పంపిణీ చేయడమే మార్గమని నిపుణులు సూచిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో.. ఈ నెల మొత్తం అర్హులైన వారికి టీకాలు వేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్ నెలలో ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు, హాలీడేస్ వంటివి లేకుండా నెలమొత్తం కొవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుందని తెలిపింది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటినవారందరికీ కరోనా టీకాలు వేయాలని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్హులంతా టీకాలు వేయించుకోవాలని కేంద్ర తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకున్నా ప్రజల్లో నిర్లక్ష్యం పనికిరాదని, తప్పనిసరిగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచించింది.