అనాథల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం

దిశ, తెలంగాణ బ్యూరో :అనాథల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనాథల సమగ్ర సంరక్షణ, భవిష్యత్, భద్రత, కుటుంబ ఏర్పాటు లక్ష్యంగా నూతన విధానంపై చర్చించారు. మొదటి సమావేశంలో మంత్రులు చేసిన ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. సెప్టెంబర్ మొదటి వారంలో మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దేశం గర్వించేలా అనాథలకోసం నూతన విధానం […]

Update: 2021-08-23 11:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో :అనాథల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనాథల సమగ్ర సంరక్షణ, భవిష్యత్, భద్రత, కుటుంబ ఏర్పాటు లక్ష్యంగా నూతన విధానంపై చర్చించారు. మొదటి సమావేశంలో మంత్రులు చేసిన ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు.

సెప్టెంబర్ మొదటి వారంలో మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దేశం గర్వించేలా అనాథలకోసం నూతన విధానం తీసుకురానున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశానికి మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎస్సీపీసీఆర్ చైర్మన్ శ్రీనివాస రావు, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి, కేబినెట్ సబ్ కమిటీ కన్వీనర్ దివ్య దేవరాజన్, సంబంధిత శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Tags:    

Similar News