దర్జాగా కాల్వ గట్ల కబ్జా.. కన్నెత్తి చూడని ఇరిగేషన్..

దిశ, బయ్యారం: మండల కేంద్రంలో ఈ మద్య కాలంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొంత మంది కాల్వగట్లను కబ్జా చేసి పక్కా సిమెంట్ భవనాలు నిర్మస్తున్నారు. కాల్వ కట్టలు కబ్జా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవమారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఫిర్యాదు చేస్తే మాకేమి అనే విదంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. చెరువు నుండి ఆయకట్టు చివర జగ్గు తండ, బంజర తండ, నల్లాల బావి ప్రదేశాలకు సుమారుగా 800 ఎకరాలకు గుండ్లోరి కాలువ ద్వారా […]

Update: 2021-11-30 10:31 GMT

దిశ, బయ్యారం: మండల కేంద్రంలో ఈ మద్య కాలంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొంత మంది కాల్వగట్లను కబ్జా చేసి పక్కా సిమెంట్ భవనాలు నిర్మస్తున్నారు. కాల్వ కట్టలు కబ్జా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవమారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఫిర్యాదు చేస్తే మాకేమి అనే విదంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.

చెరువు నుండి ఆయకట్టు చివర జగ్గు తండ, బంజర తండ, నల్లాల బావి ప్రదేశాలకు సుమారుగా 800 ఎకరాలకు గుండ్లోరి కాలువ ద్వారా నీరు ప్రవహిస్తుంది. మండల కేంద్రంలోని ఈ కాలువ అనేక చోట్ల కబ్జాలకు గురి అయింది. బయ్యారం ఎస్సి కాలనీ, గంగాబజార్ వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో, బయ్యారం బస్టాండ్ సెంటర్ సమీపంలో గల పెద్ద కాలువ పై అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణ దారులు కాలువలో చెత్త వేయడంతో నీరు దిగువన పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News