చివరినిమిషంలో పెళ్లి ఆపేసిన వధువు .. షాక్‌లో వరుడు
దిశ, వెబ్ డెస్క్ : పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం అరుదు. అలా ఆగిపోవడానికి బలమైన కారణాలే ఉంటాయి. వరుడు రెండో ఎక్కం చెప్పలేదన్న చిన్న కారణంతో యూపీలో ఓ పెండ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా మరో వివాహం కూడా పెండ్లి పీటల మీదనే ఆగిపోయింది. ఈ తతంగం అనంతపురంలో చోటుచేసుకుంది. కానీ ఈ పెండ్లి ఆగిపోవడానికి కారణం.. విద్యార్హత అవును అమ్మాయి బీటెక్ చేసింది. అబ్బాయి ఐటీఐ […]
దిశ, వెబ్ డెస్క్ : పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం అరుదు. అలా ఆగిపోవడానికి బలమైన కారణాలే ఉంటాయి. వరుడు రెండో ఎక్కం చెప్పలేదన్న చిన్న కారణంతో యూపీలో ఓ పెండ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా మరో వివాహం కూడా పెండ్లి పీటల మీదనే ఆగిపోయింది. ఈ తతంగం అనంతపురంలో చోటుచేసుకుంది. కానీ ఈ పెండ్లి ఆగిపోవడానికి కారణం.. విద్యార్హత అవును అమ్మాయి బీటెక్ చేసింది. అబ్బాయి ఐటీఐ చేశాడు కానీ ఎంటెక్ అని అబద్ధం చెప్పాడు దీంతో ఆగ్రహానికి లోనైన వధువు పెళ్లిమండపంలోనే తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో పెళ్లి ఆగిపోయింది.
ధర్మవరం పట్టణానికి చెందిన ఓ యువకునికి ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరువైపులా పెళ్లి పత్రికలను బంధువులందరికీ పంచిపెట్టారు. కదిరిలో నృసింహుని సన్నిధిలో గురువారం తెల్లవారు జామున వివాహం జరగాల్సి ఉంది. ఇరువైపుల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయం చేరుకున్నారు. ఇక కాసేపట్లో పెళ్లి అనగా వధువు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో ఆ పెళ్లికి వచ్చిన వారు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికి ఒప్పుకున్నాకే ఏర్పాట్లు చేశాం కదా ఇప్పుడు ఎందుకు పెళ్లి ఇష్టం లేదని వధువును కుటుంబసభ్యులు అడగగా .. వరుడుకి కరోనా పాజిటివ్ వచ్చినా బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అలానే తాను ఐటీఐ చేసి ఎంటెక్ అని అబద్ధం చెప్పాడు అంది. దీంతో మండపంలో వధూవరుల కుటంబాలకు మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఆఖరికి ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది.