వీడిన మిస్సింగ్ కేసు మిస్టరీ.. కొడకంచి శివారులో మృతదేహం లభ్యం
దిశ, జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఆనవాళ్లను బట్టి చూస్తే మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు హత్నూర మండలం రొయ్యపల్లి గ్రామానికి చెందిన జీళ్ళ విజయ్ కుమార్(54)గా పోలీసులు గుర్తించారు. మూడురోజుల క్రితం విజయ్ కుమార్‌పై మిస్సింగ్ కేసును హత్నూర పోలీసులు నమోదు చేశారు. మూడ్రోజుల క్రితం ఇంటినుంచి […]
దిశ, జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఆనవాళ్లను బట్టి చూస్తే మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతుడు హత్నూర మండలం రొయ్యపల్లి గ్రామానికి చెందిన జీళ్ళ విజయ్ కుమార్(54)గా పోలీసులు గుర్తించారు. మూడురోజుల క్రితం విజయ్ కుమార్‌పై మిస్సింగ్ కేసును హత్నూర పోలీసులు నమోదు చేశారు. మూడ్రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిన విజయ్ కుమార్ కొడకంచి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు. సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.