'ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి'

దిశ, మెదక్: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం అవుతున్న మరియు పూర్తి అయిన సాగునీటి ప్రాజెక్టులలో ఇతరుల సంక్షేమం కోసం కొంత మంది రైతుల త్యాగంతో లక్షలాది ఎకరాల భూమి సాగులోకి రావడం వల్ల కోట్లాది ప్రజల ఆకలి తీరనుందని, ఇదంతా భూనిర్వాసితుల త్యాగ ఫలం అని , భూములను , ఇండ్లను , ఉపాధిని కోల్పోయిన నిర్వాసితుల త్యాగం వెల కట్టలేనిది అని వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని అందుకు భూ నిర్వాసితుల సంక్షేమ బోర్డును […]

Update: 2020-05-29 01:45 GMT

దిశ, మెదక్: రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం అవుతున్న మరియు పూర్తి అయిన సాగునీటి ప్రాజెక్టులలో ఇతరుల సంక్షేమం కోసం కొంత మంది రైతుల త్యాగంతో లక్షలాది ఎకరాల భూమి సాగులోకి రావడం వల్ల కోట్లాది ప్రజల ఆకలి తీరనుందని, ఇదంతా భూనిర్వాసితుల త్యాగ ఫలం అని , భూములను , ఇండ్లను , ఉపాధిని కోల్పోయిన నిర్వాసితుల త్యాగం వెల కట్టలేనిది అని వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలని అందుకు భూ నిర్వాసితుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. భూమినే నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల దారులు పనిలేక ఉపాధి కరువై రోడ్డున పడ్డారని, వారు అందించిన సేవలను గుర్తించి వారి సంక్షేమానికి ప్రత్యేక బోర్డును ప్రాజెక్ట్ వ్యయంలో ఒక శాతం లేదా 1000 కోట్ల మూలధనంతో ఏర్పాటు చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. సకాలంలో కొండ పోచమ్మ సాగర్ ను పూర్తి చేసిన ప్రభుత్వానికి, అధికారులకు, కార్మికులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ లోక్ సత్తా పార్టీ పక్షాన ఆయన అభినందనలు తెలిపారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం చెల్లించిన పరిహారం చాలా తక్కువ అని, ఇప్పటికైనా ముఖ్య మంత్రి భూసేకరణ చట్టం- 2013 ప్రకారం భూనిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు.

Tags:    

Similar News