కర్ణాటకలో నల్ల చిరుత హల్ చల్
దిశ, వెబ్ డెస్క్: నల్లచిరుతలు చాలా అరుదుగా ఉంటాయి. కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత సంచరిస్తోందన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ షాజ్ జంగ్ ఈ చిరుతకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కబినీ అటవీ ప్రాంతంలో ఈ చిరుతను తాను చూసినట్టు ఆయన తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. దాదాపు 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఒక […]
దిశ, వెబ్ డెస్క్: నల్లచిరుతలు చాలా అరుదుగా ఉంటాయి. కర్ణాటకలోని అడవుల్లో ఓ నల్లచిరుత సంచరిస్తోందన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ షాజ్ జంగ్ ఈ చిరుతకు సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కబినీ అటవీ ప్రాంతంలో ఈ చిరుతను తాను చూసినట్టు ఆయన తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. దాదాపు 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకున్నాయి.
ఇటీవల ఒక నల్ల చిరుతపులి (బ్లాక్ పాంథర్) దక్షిణ గోవాలోని నేత్రావళి అభయారణ్యంలో తిరుగుతున్నట్టుగా ఓ ఫోటో వైరల్ అయింది. అయితే.. ఈ ఫోటోలు చూసి జంగిల్ బుక్‌లో మాదిరిగా భారత్‌లో నిజంగా బగీరా కనిపించిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరైతే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటివి చూడాలని, ప్రకృతిని ఆస్వాదించాలని అభిప్రాయపడ్డాడు. జంగిల్ బుక్ కామిక్‌లోని బగీరా ఇదేనంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.