ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదు ప్రతిని బీజేపీ విడుదల చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచే విధంగా, ఆర్థిక విధానాలపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 18వ తేదీన నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం దేశంలో బీజేపీ మత ఉద్రిక్తతలను సృష్టిస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులకు, కార్మిక […]
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదు ప్రతిని బీజేపీ విడుదల చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచే విధంగా, ఆర్థిక విధానాలపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 18వ తేదీన నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ లబ్ది కోసం దేశంలో బీజేపీ మత ఉద్రిక్తతలను సృష్టిస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులకు, కార్మిక వర్గాలకు ఎంతో నష్టాన్ని కలిగించిందని చెప్పినట్టు మీడియాలో వెలువడ్డాయని వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బోర్డర్లపై యుద్ధ చర్యలను కొనసాగిస్తున్నట్టు సీఎం చెప్పారని, ఆయన మాటలన్నీ అభ్యంతరకరమైనవని ఫిర్యాదులో తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ఉద్దేశ్యంతో అభ్యంతరకరంగా మాట్లాడుతున్నట్టు ఫిర్యాదులో తెలిపారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తన లెటర్ హెడ్‌పై ఫిర్యాదును ఎన్నికల సంఘానికి అందించినట్టు తెలిపారు.