కరోనా ఎఫెక్ట్: విద్యుత్ శాఖలో కీలక మార్పు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నియంత్రించేందుకు విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. విధులకు హాజరయ్యే వారికి ఫిజికల్ రూపంలోనే అటెండెన్స్ వేసేలా నిర్ణయించినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్‌పై ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పటికే టీఎస్ ట్రాన్స్-కో సూచించిందని ఆయన పేర్కొన్నారు. అందుకు తగినట్లుగా జాగ్రత్తలు పాటిస్తూనే వినియోగదారులకు […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నియంత్రించేందుకు విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. విధులకు హాజరయ్యే వారికి ఫిజికల్ రూపంలోనే అటెండెన్స్ వేసేలా నిర్ణయించినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొవిడ్‌పై ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పటికే టీఎస్ ట్రాన్స్-కో సూచించిందని ఆయన పేర్కొన్నారు.
అందుకు తగినట్లుగా జాగ్రత్తలు పాటిస్తూనే వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఎమర్జెన్సీకి తగినట్లుగా ఉద్యోగులు అందుబాటులో ఉండాలన్నారు. అందరూ తప్పనిసరిగా శానిటైజర్లు, మాస్కులను వినియోగించాలన్నారు. గర్భిణులుంటే మెడికల్ సర్టిఫికెట్‌ను అందజేసి లీవ్ తీసుకోవచ్చన్నారు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగులు తమ పైస్థాయి అధికారులకు సమాచారం అందజేసి క్వారంటైన్‌లో ఉండాలన్నారు. పాజిటివ్ వచ్చి విధుల్లో చేరేందుకు నెగెటివ్ రిపోర్టును అందజేయాలని సూచించారు. ఉద్యోగులందరికీ అత్యవసర సమయాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.