సెనేటర్ సాండర్స్ ‘మీమ్’ హెల్ప్
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అట్టహాస వేడుకలు లేకపోయినా పాప్ స్టార్ లేడీ గాగా జాతీయ గీతాన్ని పాడటం, జెన్నిఫర్ లోపెజ్, టామ్ హాంక్స్ షోస్.. అమండా పోయెట్రి.. ఇలా ఎన్నో మెరుపులు వేదికపై మెరిసినా.. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది మాత్రం సెనేటర్ బెర్నీ సాండర్స్ గ్రంపీ ఫొటోనే.. నెట్టింట ఎక్కడ చూసినా ఆయన ఫొటోనే దర్శనమిస్తుంది. సెలెబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు అతని […]
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అట్టహాస వేడుకలు లేకపోయినా పాప్ స్టార్ లేడీ గాగా జాతీయ గీతాన్ని పాడటం, జెన్నిఫర్ లోపెజ్, టామ్ హాంక్స్ షోస్.. అమండా పోయెట్రి.. ఇలా ఎన్నో మెరుపులు వేదికపై మెరిసినా.. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది మాత్రం సెనేటర్ బెర్నీ సాండర్స్ గ్రంపీ ఫొటోనే.. నెట్టింట ఎక్కడ చూసినా ఆయన ఫొటోనే దర్శనమిస్తుంది. సెలెబ్రిటీల నుంచి కామన్ మ్యాన్ వరకు అతని ఫొటోలను ట్రెండ్ చేస్తున్నారు.
1975 నాటి ‘షోలే’ సినిమాలోని ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ అనే పాట ఎంత సంచలనమో వేరే చెప్పనక్కర్లేదు. ఆ పాటలో అమితాబ్, ధర్మేంద్ర బుల్లెట్ బైక్‌పై ఆడిపాడి యావత్ ప్రేక్షక లోకాన్ని ఊర్రూతలూగించారు. వారితో ‘జెర్నీ సాండర్స్’ జతకట్టాడు. అదెలా సాధ్యమనుకుంటున్నారా? అదొక్కటే కాదు..‘బదాయి హో’ ‘హామ్ సాథ్ సాథ్ హై’ మూవీ పోస్టర్స్‌లో, పలు సినిమా షూటింగ్ లోకేషన్లలో, ప్రెస్ మీట్స్‌లో, పాత సినిమా పాటల్లో, సీన్లలో, పార్కు బెంచీలపైన, స్పేస్‌లో, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో, స్పోర్ట్స్ ఫీల్డ్ ఇలా ఎక్కడ చూసినా బెర్నీ సాండర్స్ ఫొటోనే దర్శనమిస్తుంది. బాలీవుడ్ దివా దీపకా పదుకునె, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్ కూడా సాండర్స్ మీమ్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశారు. ఈ డికేడ్‌లోనే ఆయన మీమ్ ది బెస్ట్‌గా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సెనేటర్ సాండర్స్ క్యాంపెయిన్ టీమ్ ఈ వైరల్ ట్రెండ్‌ను ‘క్యాపిటలైజ్’ చేసేందుకు సిద్ధమైంది.
సాండర్స్ ఫొటోలు వైరల్ కావడానికి ఆయన స్టిల్‌తో పాటు, ఆయన ధరించిన దుస్తులు కూడా ఓ కారణం. సాండర్స్ క్యాంపెయిన్ టీం, ఆయన ధరించిన స్వెట్ షర్ట్స్‌పై అతడి గ్రంపీ(క్రోధ స్వభావం) లుక్ ఫొటోను ముద్రించి ఆన్‌లైన్‌లో 45 డాలర్లకు అమ్మకానికి పెట్టింది. సేంద్రియ కాటన్ ఉన్నితో తయారుచేసిన ఈ స్వెట్ షర్ట్స్ అమ్మగా వచ్చిన డబ్బులను ‘మీల్స్ ఆన్ వీల్స్’ అనే చారిటీ సంస్థకు ఇవ్వనున్నట్లు సాండర్స్ తెలిపారు. దాంతో నెటిజన్లు సాండర్స్ వంటి నాయకులు ఈ ప్రపంచానికి మరెంతోమంది కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు.