11 నిమిషాల్లో 12 కిలోమీటర్లు ప్రయాణించిన అంబులెన్స్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: లైవ్ ఆర్గాన్ రవాణా కోసం హైదరాబాద్ నగర పోలీసులు మరోమారు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. దీంతో అవయవాలతో ఉన్న అంబులెన్స్ 11 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 నిమిషాల వ్యవధిలో చేరింది. శనివారం ఉదయం 10.09 గంటలకు మలక్ పేట లోని యశోద ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మృతిచెందిన వ్యక్తి నుండి సేకరించిన గుండె, ఊపిరి తిత్తులను తరలించేందుకు గాను గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులు […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: లైవ్ ఆర్గాన్ రవాణా కోసం హైదరాబాద్ నగర పోలీసులు మరోమారు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. దీంతో అవయవాలతో ఉన్న అంబులెన్స్ 11 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 నిమిషాల వ్యవధిలో చేరింది. శనివారం ఉదయం 10.09 గంటలకు మలక్ పేట లోని యశోద ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మృతిచెందిన వ్యక్తి నుండి సేకరించిన గుండె, ఊపిరి తిత్తులను తరలించేందుకు గాను గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి అధికారులు ట్రాఫిక్ పోలీసులను కోరారు. దీంతో వారు అవయవాల తరలింపు అంబులెన్స్‌కు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడంతో కేవలం 12 నిమిషాల వ్యవధిలో గమ్యం చేరింది. ట్రాఫిక్‌ను నిలిపేయడం ద్వారా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులను ఆసుపత్రి యాజమాన్యాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ ఏడాదిలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలా 30 సార్లు అవయవ రవాణాకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.