వారం గడుస్తున్నా… ఎలాంటి చర్యలు లేవు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహిళలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సురేశ్ ఆరోపించారు. ఆదివారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారలు, అఘాయిత్యాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపి, విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ… దేశంలో నిత్యం మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహిళలను రక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సురేశ్ ఆరోపించారు. ఆదివారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారలు, అఘాయిత్యాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపి, విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ…
దేశంలో నిత్యం మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. మిర్యాలగూడకు చెందిన గిరిజన యువతిపై 139 మంది కామాంధులు సంవత్సరాల పాటు చిత్రహింసలు పెట్టి ఐదు వేల సార్లు అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు చేసి, వారం రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావు ఇస్తోందన్నారు.
నిందితుల్లో అగ్రవర్ణాలు, కీలక వ్యక్తులు ఉండటం కారణంగానే తాత్సారం జరుగుతోందని ధ్వజమెత్తారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటనలో చాలా వేగంగా కేసును పూర్తి చేసి, ఈ ఘటనపై ఆలస్యం చేయడం తగదన్నారు. సీబీసీఐడీ చేత విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.