‘ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా నా భూమి తీసుకుంది.. న్యాయం చేయండి’

దిశ, చార్మినార్​ : ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా తన 134 ఎకరాల స్థలం తీసుకుందని, 14 ఏళ్లు అవుతున్నా తనకు రావాల్సిన నష్టపరిహారాన్ని అందజేయడంలో జాప్యం చేస్తున్నారని నవాబ్​ మహ్మద్​ హైదర్​ ఉద్దీన్​ ఖాన్​, జీపీఏ హోల్డర్​ మొయినుద్దీన్​ ఖాన్​లు అరోపించారు. సోమవారం పాతబస్తీ చాంద్రాయణగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శంషాబాద్​ మండలంలోని రషీద్​గూడ విలేజ్‌ సర్వేనెంబర్​ 34లో ​ మొఘల్​పురాకు చెందిన తన తల్లి అహ్మద్​ ఉన్నీసా పేరు మీదదాదాపు […]

Update: 2021-09-06 09:37 GMT

దిశ, చార్మినార్​ : ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా తన 134 ఎకరాల స్థలం తీసుకుందని, 14 ఏళ్లు అవుతున్నా తనకు రావాల్సిన నష్టపరిహారాన్ని అందజేయడంలో జాప్యం చేస్తున్నారని నవాబ్​ మహ్మద్​ హైదర్​ ఉద్దీన్​ ఖాన్​, జీపీఏ హోల్డర్​ మొయినుద్దీన్​ ఖాన్​లు అరోపించారు. సోమవారం పాతబస్తీ చాంద్రాయణగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. శంషాబాద్​ మండలంలోని రషీద్​గూడ విలేజ్‌ సర్వేనెంబర్​ 34లో ​ మొఘల్​పురాకు చెందిన తన తల్లి అహ్మద్​ ఉన్నీసా పేరు మీదదాదాపు 460 ఎకరాల పట్టాభూమి ఉందని తెలిపారు.

అందులోని 134 ఎకరాలు 2008లో శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా తీసుకుందని, దానికి సంబంధించిన నష్ట పరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. మితగా స్థలంలో కూడా కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై శంషాబాద్​ మండల​ రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు కూల్చివేశారని, ప్రస్తుతం ఆ స్థలం తమది కాదు ప్రభుత్వ స్థలం అంటున్నారని వాపోయారు. అవి ప్రభుత్వ స్థలాలు కావని, ఆస్థలాలపై న్యాయ విచారణ జరిపించాలని, స్థలానికి సంబంధించిన నష్టపరిహారాన్ని తమకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు విన్నపించారు.

Tags:    

Similar News