ఇన్ స్టాగ్రాం ద్వారా బాలికకు దగ్గరై.. పోలీస్టేషన్ నుంచి పరారీ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పోలీస్టేషన్ నుంచి నిందితుడు పారిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎడపల్లి మండలం సిద్ధాపూర్‌కు చెందిన పిరాజీ ఇన్ స్టాగ్రాం ద్వారా ఒక మైనర్ బాలికకు దగ్గర అయ్యాడు. తరువాత ఆమె ఫోటోలు, వీడియోలు తీసుకొని వేధించాడు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా కోర్టులో లొంగి పోయాడు. కోర్టు పిరాజీకి రిమాండ్ విధించింది. […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పోలీస్టేషన్ నుంచి నిందితుడు పారిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎడపల్లి మండలం సిద్ధాపూర్‌కు చెందిన పిరాజీ ఇన్ స్టాగ్రాం ద్వారా ఒక మైనర్ బాలికకు దగ్గర అయ్యాడు. తరువాత ఆమె ఫోటోలు, వీడియోలు తీసుకొని వేధించాడు. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా కోర్టులో లొంగి పోయాడు. కోర్టు పిరాజీకి రిమాండ్ విధించింది. కోర్టు అనుమతితో పిరాజినీ స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించినా పోలీసులకు మస్కా కొట్టి గురువారం తెల్లవారు జామున పోలీస్ స్టేషన్ నుంచి పరార్ అయ్యాడు. పోలీస్ స్టేషన్‌ను బోధన్ ఏసీపీ రామారావు సందర్శించి వివరాలు సేకరించారు. స్టేషన్ నుంచి తప్పించుకున్న యువకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఎస్‌ఐ ఎల్లగౌడ్ తో పాటు సిబ్బంది పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.