సమాధి కింద శవం.. పదేళ్లయినా చెక్కుచెదరని శరీరం
దిశ, చార్మినార్: పదేళ్ల క్రితం పాతిపెట్టిన శవం.. శవంతో పాటు పైన కప్పిన దుప్పటి చెక్కు చెదరని దృశ్యం.. పాతబస్తీలోని ఓ శ్మశాన వాటికలో బుధవారం వెలుగు చూసింది. పాతబస్తీ జహనుమ శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం గుంత తీస్తుండగా పక్క సమాధికి పెద్ద రంధ్రం ఏర్పడింది. అందులోంచి శవం దర్శనమిచ్చింది. శవం పై కప్పిన బట్ట కూడా చెదిరి పోకుండా ఆలాగేవుంది. శవం కూడా కుళ్ళీ పోకుండా ఉన్నదని శ్మశాన వాటిక నిర్వాహకులు ప్రకటించారు. దీంతో […]
దిశ, చార్మినార్: పదేళ్ల క్రితం పాతిపెట్టిన శవం.. శవంతో పాటు పైన కప్పిన దుప్పటి చెక్కు చెదరని దృశ్యం.. పాతబస్తీలోని ఓ శ్మశాన వాటికలో బుధవారం వెలుగు చూసింది. పాతబస్తీ జహనుమ శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం గుంత తీస్తుండగా పక్క సమాధికి పెద్ద రంధ్రం ఏర్పడింది. అందులోంచి శవం దర్శనమిచ్చింది. శవం పై కప్పిన బట్ట కూడా చెదిరి పోకుండా ఆలాగేవుంది. శవం కూడా కుళ్ళీ పోకుండా ఉన్నదని శ్మశాన వాటిక నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఆ సమాధి 10 ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు. 10 ఏళ్ళు అయినా శవం చెక్కు చెదరక పోవడంతో మృతి చెందిన వ్యక్తి దైవ చింతన కలిగిన వ్యక్తిగా, పుణ్యాత్ముడుగా ముస్లింలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.