ఆ వీడియో నన్ను ఏడిపించింది: శిల్పాశెట్టి
కేవలం చర్మం రంగు కారణంగా మేమెందుకు భిన్నంగా ట్రీట్ చేయబడుతున్నాం. మనం నల్లజాతివారిమే.. కానీ, తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం తప్పుడుగా ట్రీట్ చేయబడుతున్నాం కనుక పోరాడాల్సిన అవసరముంది. మన హక్కులు మనకు కావాలి’ అంటున్న ఓ చిన్నారి వీడియో ఈ మధ్య నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన బాలీవుడ్ యోగా బ్యూటీ శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో నన్ను ఏడిపించేసిందని పోస్ట్ పెట్టింది. ‘ఆ చిన్నారిలో ఎంత […]
కేవలం చర్మం రంగు కారణంగా మేమెందుకు భిన్నంగా ట్రీట్ చేయబడుతున్నాం. మనం నల్లజాతివారిమే.. కానీ, తక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం తప్పుడుగా ట్రీట్ చేయబడుతున్నాం కనుక పోరాడాల్సిన అవసరముంది. మన హక్కులు మనకు కావాలి’ అంటున్న ఓ చిన్నారి వీడియో ఈ మధ్య నెట్టింట్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన బాలీవుడ్ యోగా బ్యూటీ శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో నన్ను ఏడిపించేసిందని పోస్ట్ పెట్టింది. ‘ఆ చిన్నారిలో ఎంత బాధ ఉంటే ఇంత చిన్నవయస్సులో ఇలాంటి మాటలు మాట్లాడగలిగింది’ అని బాధపడింది శిల్ప. నల్లజాతీయులపట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడం సమంజసం కాదంటున్న శిల్పాశెట్టి.. ‘మనం ఒక బాక్స్‌లో ఉన్న కలర్ పెన్సిల్స్ కాదు. మనకూ మనసుంది. అది చూపించాల్సిన సమయం వచ్చింది’ అని పిలుపునిచ్చింది.
https://www.instagram.com/p/CA-Pu-IFRIC/?utm_source=ig_web_copy_link
అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ హత్య అనంతరం నిరసనలు వెల్లువెత్తుతుండగా ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం కలర్ కారణంగా అసమానతలు తలెత్తడం శోచనీయం అంటూ #BlackLivesMatter #JusticeForGeorgeFloyd పేరుతో సెలబ్రిటీలు పెద్ద ఎత్తున మద్ధతు ప్రకటిస్తున్నారు.