బ్రేకప్ తర్వాత ఎమోషనల్ ‘దర్శనం’
బిగ్‌బాస్ సీజన్ 3తో ఫేమస్ అయిన దర్శన్, హీరోయిన్ సనమ్ శెట్టిల మధ్య దూరం పెరిగింది. అయితే ఇద్దరి మధ్య నిశ్చితార్థం జరిగాక తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని దర్శన్‌పై కేసు పెట్టింది శెట్టి. దీంతో చాలా బాధపడిపోయిన దర్శన్… తను వేరే అబ్బాయితో తిరుగుతోందని, అందుకే పెళ్లి చేసుకునే ఆలోచన మానేశానని మీడియా ముందు చెప్పేశాడు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ… సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు దర్శన్. ఇద్దరు […]
బిగ్‌బాస్ సీజన్ 3తో ఫేమస్ అయిన దర్శన్, హీరోయిన్ సనమ్ శెట్టిల మధ్య దూరం పెరిగింది. అయితే ఇద్దరి మధ్య నిశ్చితార్థం జరిగాక తనను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని దర్శన్‌పై కేసు పెట్టింది శెట్టి. దీంతో చాలా బాధపడిపోయిన దర్శన్… తను వేరే అబ్బాయితో తిరుగుతోందని, అందుకే పెళ్లి చేసుకునే ఆలోచన మానేశానని మీడియా ముందు చెప్పేశాడు. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ… సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు దర్శన్.
ఇద్దరు వ్యక్తుల మధ్యం బంధం విఫలం అయితే… పరిస్థితులు కఠినంగా మారక ముందే విడిపోవడం మంచిది అంటూ పోస్ట్ పెట్టాడు. సంతోషంగా లేనప్పుడు ఒకరినొకరు నొప్పించుకోకుండా రిలేషన్ షిప్ బ్రేక్ చేయడమే మంచింది అన్నాడు. సనమ్ శెట్టిని ఉద్దేశిస్తూ ఆ వ్యక్తి మీద నాకు కొంచెం గౌరవమైనా ఉంది. కానీ, పనిగట్టుకుని నా జీవితాన్ని నాశనం చేసిందంటూ ఎమోషనల్ అయ్యాడు. నా మీద వచ్చిన ఆరోపణలతో మీడియా ముందు దోషిలా నిల్చున్నానని, కానీ జరిగిందేంటో వాళ్లకి తెలియదన్నాడు. ఈ సంఘటనతో చాలా బాధపడ్డానని, కానీ దీని నుంచే జీవిత పాఠం నేర్చుకున్నానన్నారు. ఇప్పుడు పూర్తిగా కెరియర్ మీద దృష్టిపెడతానన్నాడు. ఒడిదుడుకుల్లో నా వెన్నంటే ఉన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలే తెలుపుతూ పోస్ట్ ముగించాడు.