తండ్రిపై కేసు ఫైల్ చేసిన హీరో విజయ్.. ఎందుకంటే ?
దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్ తన పేరెంట్స్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ప్రస్తుత సమాచారం మేరకు ఈ కోలీవుడ్ స్టార్ యాక్టర్.. తన పేరును లేదా తన అభిమాన సంఘాల పేరును రాజకీయాల్లో ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ కేస్ ఫైల్ చేశారు. అసలు విషయానికొస్తే.. విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడైన SA చంద్రశేఖర్ ‘ఆల్ […]
దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్ తన పేరెంట్స్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ప్రస్తుత సమాచారం మేరకు ఈ కోలీవుడ్ స్టార్ యాక్టర్.. తన పేరును లేదా తన అభిమాన సంఘాల పేరును రాజకీయాల్లో ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ కేస్ ఫైల్ చేశారు. అసలు విషయానికొస్తే.. విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడైన SA చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఐయక్కం’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎస్ఏ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శిగా, శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా, పద్మనాభన్ నాయకుడిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద ఈ పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేయబడింది.
అయితే గతేడాది విజయ్ తన తండ్రి స్థాపించిన పార్టీలో చేరినట్లు వార్తలు వెలువడగా.. తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశాడు దళపతి. తండ్రి రాజకీయ ఆకాంక్షలకు తాను కట్టుబడి లేనని, అభిమానులెవరూ ఆ పార్టీలో చేరవద్దని అభ్యర్థించాడు. ఎవరైనా తన పేరు, ఫోటోను లేదా అభిమాన సంఘాలను పొలిటికల్ ఫేవర్ కోసం దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటానని నవంబర్ 2020లో ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం కొన్నాళ్లుగా సద్దుమణిగినా అక్టోబర్ 6,7 తేదీల్లో తమిళనాడులోని స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో నటుడు విజయ్ పేరిట మొదలైన పార్టీ కూడా పోటీ చేస్తుండటంతో ఈ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది.