బిగ్ బ్రేకింగ్ : TET సర్టిఫికెట్ జీవితకాలం పొడగింపు!
దిశ, వెబ్‌డెస్క్ : టెట్(TET) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురు చూసే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గతేడాది నుంచి కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో నిరుద్యోగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఈ క్రమంలో టెట్ రాసి నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే అభ్యర్థుల్లో ఏడేళ్ల సర్టిఫికెట్ వ్యాలిడిటీ అయిపోయిన వాళ్లు మళ్లీ టెట్ రాయాల్సి ఉంటుంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : టెట్(TET) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయ ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురు చూసే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గతేడాది నుంచి కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో నిరుద్యోగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఈ క్రమంలో టెట్ రాసి నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే అభ్యర్థుల్లో ఏడేళ్ల సర్టిఫికెట్ వ్యాలిడిటీ అయిపోయిన వాళ్లు మళ్లీ టెట్ రాయాల్సి ఉంటుంది.
అలాంటి వారు ఏజ్ లిమిట్ ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే (TET) ఉపాధ్యాయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఏడేళ్ల సర్టిఫికెట్ నిబంధనను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ వ్యాలిడిటీ ముగిసిన వారికి జీవితకాలానికి ఉపయోగపడేలా కొత్త ధృవపత్రాలను జారీ చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయం C-TET తో పాటు రాష్ట్రాలు కండక్ట్ చేసే TET పరీక్షకు కూడా వర్తించనున్నట్లు సమాచారం. కేంద్రం తాజా నిర్ణయంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.