‘ఉగ్ర’టాప్ కమాండ‌ర్ హతం

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సైఫుల్లాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై ఐజీపీ విజయ్ కుమార్ స్పందిస్తూ ‘భద్రతా దళాలు, పోలీసులు నేడు గొప్ప విజయాన్ని సాధించారు. హిజ్బుల్ చీఫ్‌ను హతమార్చడం చిన్న విషయమేమీ కాదు’ అని అన్నారు. ఈ ఏడాది మే నెలలో రియాజ్ నాయికూను హతమార్చిన తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ బాధ్యతలను సైఫుల్లా తీసుకున్నారు. ఈయన కశ్మీర్‌ […]

Update: 2020-11-01 06:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సైఫుల్లాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై ఐజీపీ విజయ్ కుమార్ స్పందిస్తూ ‘భద్రతా దళాలు, పోలీసులు నేడు గొప్ప విజయాన్ని సాధించారు. హిజ్బుల్ చీఫ్‌ను హతమార్చడం చిన్న విషయమేమీ కాదు’ అని అన్నారు. ఈ ఏడాది మే నెలలో రియాజ్ నాయికూను హతమార్చిన తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ బాధ్యతలను సైఫుల్లా తీసుకున్నారు. ఈయన కశ్మీర్‌ లోయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా కొనసాగారు. దక్షిణ కశ్మీర్‌ను శ్రీనగర్ శివారులో వచ్చి సైఫుల్లా ఓ ఇంట్లో తలదాచుకుంటున్నట్టు సమాచారమందగానే కార్డన్ సెర్చ్ నిర్వహించారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే సైఫుల్లా కాల్పులు తెగబడ్డారని, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపగా హిజ్బుల్ చీఫ్ హతమయ్యారని వివరించారు. తమకు అందిన సమాచారం ప్రకారం, 95శాతం మృతిచెందిన ఉగ్రవాది డాక్టర్ సైఫుల్లానే అని విజయ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News