Child Marriage : బాల్య వివాహానికి రెడీ అయిన న్యాయవాది.. ఇంతలో పోలీసుల ఎంట్రీ
దిశ, సూర్యాపేట : జూనియర్ న్యాయవాది వృత్తిలో ప్రాక్టీస్ పొందుతున్న ఓ వ్యక్తి బాల్యవివాహానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది. కరోనా వేళ గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహం నిర్వహిస్తుండగా ఇరుపక్షాల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని నిలిపివేశారు. ఈ ఘటనపై ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్ పహాడ్ మండల పరిధిలోని న్యూ బంజారా హిల్స్ తండాలో వాంగుడోత్ మంగత, సక్రిల కుమార్తె (16)తో మఠంపల్లి మండలం […]
దిశ, సూర్యాపేట : జూనియర్ న్యాయవాది వృత్తిలో ప్రాక్టీస్ పొందుతున్న ఓ వ్యక్తి బాల్యవివాహానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది. కరోనా వేళ గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహం నిర్వహిస్తుండగా ఇరుపక్షాల తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని నిలిపివేశారు.
ఈ ఘటనపై ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్ పహాడ్ మండల పరిధిలోని న్యూ బంజారా హిల్స్ తండాలో వాంగుడోత్ మంగత, సక్రిల కుమార్తె (16)తో మఠంపల్లి మండలం బిల్యా నాయక్ తండా గ్రామానికి చెందిన మాలోత్ మగ్త, మంథి కుమారుడు గోవింద్ నాయక్ (36)ల వివాహం జరిపిస్తున్నారు. ఈ వివాహంపై.. పక్క సమాచారం మేరకు జిల్లా ఉమెన్ వెల్పేర్ చైల్డ్ అభివృద్ధి సఖీ సెంటర్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ఇరువురి విద్యా సర్టిఫికేట్స్ పరిశీలించన అనంతరం బాల్య వివాహంగా గుర్తించి నిలిపివేశారు.
కాగా, బాలిక తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు కావడంతో వర కట్నాలు ఇచ్చుకోలేక ఈ వివాహం జరిపిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. అయితే వరుడికి మాత్రం ఇది మూడో పెళ్లి అని సమాచారం. కాగా.. గోవింద్ నాయక్ హైకోర్టులో జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ పొందుతున్నాడు. ఈ క్రమంలో తన కంటే 20 సంవత్సరాలు చిన్న వయస్సులో ఉన్న బాలికను వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ పొందుతూ బాల్య వివాహం చేసుకోవడం ఏంటని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బాల్య వివాహాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.