ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి పదవీకాలం పొడిగింపు

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర నీటిపారుదలశాఖలో ఎత్తిపోతల పథకాల సలహాదారుగా వ్యవహరిస్తున్న కె. పెంటారెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవీ కాలం పొడిగింపు ఈ నెల 16వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఇందుకు కావల్సిన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను కోరారు. 2018లో పెంటారెడ్డిని మొదటిసారి సలహాదారుగా […]

Update: 2020-05-26 05:53 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర నీటిపారుదలశాఖలో ఎత్తిపోతల పథకాల సలహాదారుగా వ్యవహరిస్తున్న కె. పెంటారెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవీ కాలం పొడిగింపు ఈ నెల 16వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని జీవోలో పేర్కొన్నారు. ఇందుకు కావల్సిన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను కోరారు. 2018లో పెంటారెడ్డిని మొదటిసారి సలహాదారుగా నియమించినప్పటి నిబంధనలే ఇప్పుడు వర్తిస్తాయని తెలిపారు.

Tags:    

Similar News