బీ రెడీ.. రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు అనేక జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. దాదాపు అన్ని విద్యాసంస్థలకు 14రోజులు ఈ నెల 31వరకూ సెలవులు ప్రకటించింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల సం రాష్ట్రవ్యాప్తంగా […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు అనేక జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. దాదాపు అన్ని విద్యాసంస్థలకు 14రోజులు ఈ నెల 31వరకూ సెలవులు ప్రకటించింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల సం రాష్ట్రవ్యాప్తంగా 2,530 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు అంతా ఒకేసారి రాకుండా, ఒకేచోట గుంపులుగా ఉండకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఎంత మందుగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడమే కాకుండా పరీక్ష హాల్లోకి పంపించేలా చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించినట్టు సూచనలు జారీ చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు బాగా రాయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం ఆమె అధికారులతో సమీక్షించారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు వెబ్‌సైట్ నుంచి 4.05 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నట్టు సబిత వెల్లడించారు. వేసవి తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఇద్దరు చొప్పున వైద్య సిబ్బందిని, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు వివరించారు.
Tags: 10th class, Annual test, Education Minister P Sabitha Indra Reddy, corona virus