సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ల టెన్షన్​

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ల బెంగ పట్టుకుంది. తమకు టికెట్టు ఇస్తారా..? లేదా..? అని లోలోపల మథనపడుతున్నారు. అధిష్ఠానం సిట్టింగ్ లకే అవకాశం ఇస్తామని సంకేతాలు వెలువరించిన అనంతరం మున్సిపల్ మంత్రి కేటీఆర్ కొంతమంది కార్పొరేటర్లను మార్చడం అనివార్యమనే సూచనలు చేశారు. దీనికితోడు ఆ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు సీనియర్ నాయకులు వెల్లడిస్తున్నారు. దీంతో వారు టికెట్టు ఇస్తారా.. లేదా.., పార్టీ మారాలా..? వద్దా…? అనే సందిగ్థంలో ఉన్నారు. […]

Update: 2020-11-16 13:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్ల బెంగ పట్టుకుంది. తమకు టికెట్టు ఇస్తారా..? లేదా..? అని లోలోపల మథనపడుతున్నారు. అధిష్ఠానం సిట్టింగ్ లకే అవకాశం ఇస్తామని సంకేతాలు వెలువరించిన అనంతరం మున్సిపల్ మంత్రి కేటీఆర్ కొంతమంది కార్పొరేటర్లను మార్చడం అనివార్యమనే సూచనలు చేశారు. దీనికితోడు ఆ బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు సీనియర్ నాయకులు వెల్లడిస్తున్నారు. దీంతో వారు టికెట్టు ఇస్తారా.. లేదా.., పార్టీ మారాలా..? వద్దా…? అనే సందిగ్థంలో ఉన్నారు.

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కార్పొరేటర్లకు ఎమ్మెల్యేల గండం పట్టుకుంది. తమకు టికెట్టు ఇస్తారా… లేదా..? అనేది ఇప్పుడు సిట్టింగ్ కార్పొరేటర్లను వేధిస్తున్న ప్రశ్న. అధిష్ఠానం సిట్టింగ్ లకే టికెట్టు అని సంకేతాలను వెలువరించింది. అనంతరం పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు మరి కొంతమంది సిట్టింగ్ లను మార్చడం అనివార్యమనే సూచనలు చేశారు. పార్టీ నాయకత్వం మాత్రం ఎమ్మెల్యేలకే పూర్తి బాధ్యతలను అప్పగించినట్టు సీనియర్లు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు టికెట్టు బెంగపట్టుకుంది. గత శాసన సభ ఎన్నికల్లో ఆయను వ్యతిరేకించడం, టికెట్టు ఇవ్వొద్దని పార్టీకి విన్నవించడం, ఎన్నికల్లో నమ్మకంగా పనిచేయకపోవడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని తమను పక్కనపెడతారా.. ? అనే అనుమానాలు వారిని తికమక పెడుతున్నాయి. దీంతో వారు పార్టీలో ఉండాలా..? వద్దా…? అని ఆలోచిస్తున్నారు.

ఎమ్మెల్యేల సంకేతాలు…

సొంత పార్టీ కార్పొరేటర్లే అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తమను వ్యతిరేకించిన సిట్టింగ్ వారికి టికెట్టు ఇచ్చే ప్రసక్తిలేదని ఎమ్మెల్యేలు సంకేతాలను వెల్లడించారు. బహిరంగంగా ఎవరెవరినీ మార్చబోతున్నారనేది కూడా వారు ముందుగానే వెలువరిస్తున్నారు. ప్రధానంగా శివారు నియోజకవర్గాల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి పార్టీ మారిన నియోజకవర్గాల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తున్నది.

తాము పార్టీ మారినప్పుడు తమను నమ్ముకుని వెంట వచ్చిన వారికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలనేది వారి అభిప్రాయంగా ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఆ పార్టీ గుర్తుపై గెలిచిన వారికి ఈ మారు ఎన్నికల్లో కొందరికి మొండి చేయి ఖాయంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా రాజేంద్రనగర్(ఇద్దరు కార్పొరేటర్లకు), శేరిలింగంపల్లి(ముగ్గురికి), కూకట్‎పల్లి, కుత్బుల్లాపూర్(ఇద్దరికి), మల్కాజిగిరి(ముగ్గురికి), ఉప్పల్(ఇద్దరికి), ఎల్బీనగర్(ఇద్దరు) సిట్టింగ్ లను మార్చే సంకేతాలు వెలువడుతున్నాయి.

మొర ఆలకించేనా..?

ఎమ్మెల్యేల తీరుపై టీఆర్ఎస్ అధిష్ఠానానికి మొరపెట్టుకునేందుకు సిట్టింగ్ కార్పొరేటర్లు సన్నద్ధమవుతున్నా రు. ఉద్యమం, ఆవిర్భావం నుంచి తాము పార్టీకి చేసిన సేవలను వివరించడంతోపాటు సిట్టింగ్ కాలంలో తమపై ఆరోపణలు లేవని అధిష్ఠానానికి చెప్పి టికెట్టు తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే తమకు టికెట్టు ఇవ్వని పక్షంలో అధిష్ఠానం వద్దకు వెళ్తామని లేదా బీజేపీలో చేరుతామని వారు యోచిస్తున్నారు. ఈ పాటికే తమగాడ్ ఫాదర్ల ద్వారా ముఖ్యంగా వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రా మారావును కలిసే దిశగా పావులు కదుపుతున్నారు.

Tags:    

Similar News