ఓటమి ఎఫెక్ట్‌తో గులాబీ నేతల్లో గుబులు.. కేసీఆర్ రెస్పాన్స్‌పై ఉత్కంఠ.?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : వరద ప్రవాహాంలా సాగిన చేరికల కార్యక్రమంతో ఎన్నికల తంతు ముగిసింది. అయితే అక్కడి నాయకులను తాజాగా ఓ సమస్య పట్టి పీడిస్తున్నట్టు తెలుస్తోంది. ఓటమితో కుంగిపోయిన తమకు పదవుల పందేరాం కట్టబెడతారా.? లేక మొండి చేయి చూపుతారా.? అన్న అనుమానం వారిలో నెలకొంది. బయటకు చెప్పుకోలేక, అధినేతను అడగాలా వద్దా అన్న విషయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నాయకుల నుండి […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : వరద ప్రవాహాంలా సాగిన చేరికల కార్యక్రమంతో ఎన్నికల తంతు ముగిసింది. అయితే అక్కడి నాయకులను తాజాగా ఓ సమస్య పట్టి పీడిస్తున్నట్టు తెలుస్తోంది. ఓటమితో కుంగిపోయిన తమకు పదవుల పందేరాం కట్టబెడతారా.? లేక మొండి చేయి చూపుతారా.? అన్న అనుమానం వారిలో నెలకొంది. బయటకు చెప్పుకోలేక, అధినేతను అడగాలా వద్దా అన్న విషయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నాయకుల నుండి క్షేత్ర స్థాయి నాయకుల వరకు ప్రతీ ఒక్కరినీ టీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు. ఈటల వెంట నడిచిన వారే అయినా, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులే ఇలా అందరిపై దృష్టి సారించి క్లీన్ స్వీప్ చేసేసుకున్నారు.
అయితే అధినేత కేసీఆర్‌పై నమ్మకం ఉంచి అప్పుడు పార్టీ ఫిరాయించిన నాయకులు ఇప్పుడు అంతర్మథనంలో పడిపోయారని తెలుస్తోంది. ఎన్నికల ముందు తమకే అన్నింటా ప్రాధాన్యం ఉంటుందని భావించి చేరినప్పటికీ హుజురాబాద్ ఓటర్లు ఇచ్చిన తీర్పు ఎఫెక్ట్ తమపై ఎంతమేర ఉంటుందోనన్నదే అంతు చిక్కకుండా తయారైందని భావిస్తున్నారట. ఓటర్ల మద్దతు ఈటల వైపే అని ఫలితం రావడంతో అధినేత రియాక్షన్ ఎలా ఉంటుందోనని వారి మదిలో మెదులుతున్న ఆలోచన.
హుజురాబాద్‌లో పద్మశాలీ సామాజిక వర్గం అండ కోసం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను, రెండు సార్లు ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డిని, కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డిలకు గులాబీ తీర్థం ఇచ్చారు. అయితే, ఎల్. రమణకు ఎమ్మెల్సీ ఖాయం అన్న ప్రచారం జరగగా, పెద్దిరెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ లేదా, రాజ్యసభ సభ్యునిగా, కరీంనగర్ ఎంపీగా వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది. అలాగే పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని కేబినెట్ తీర్మాణం చేసినప్పటికీ అవాంతరాలు ఏర్పడటంతో ఆ పోస్టు హోల్డ్‌లో ఉండిపోయింది. ఎన్నికల ఫలితాల తరువాత ఏదో పదవి వరించే అవకాశం ఉంటుందని నిన్నటి వరకు కలలు కన్నప్పటికీ ఫలితాల ఇచ్చిన ఝలక్‌తో తమ పదవుల పరిస్థితి ఏంటన్నదీ మిస్టరీగా మారింది.
లోకల్ లీడర్ల పరిస్థితి..?
ఇకపోతే టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న హుజురాబాద్ నాయకులకు కూడా పదవుల పందేరం ఉంటుందా లేదా అన్న చర్చ సాగుతోంది. హుజురాబాద్‌కు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్‌కు హుజురాబాద్, జమ్మికుంట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని కట్టబెడ్తామన్న హామీ ఇచ్చారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అథారిటీని ఏర్పాటు చేసి కమిటీని నియమించాల్సి ఉంది. అలాగే జమ్మికుంటకు చెందిన పొనుగంటి మల్లయ్య కూడా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిపై కన్నేశారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల వీరి భవితవ్యం ఎలా ఉండబోతోందన్న చర్చ సాగుతోంది.