ఎగురుతున్న విమానంపై టెన్నిస్ గేమ్.. హిస్టరీ క్రియేట్ చేసిన యువతులు
దిశవెబ్‌డెస్క్: వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్ లీ ఎస్ట్ గేమ్ టెన్నిస్. మట్టిలో పుట్టిన టెన్నిస్ లాంటి కాస్ట్ లీ ఎస్ట్ గేమ్ స్పోర్ట్స్ అన్నీ ఇప్పుడు మ్యాట్, సింథటిక్ కోర్ట్ లపైకి వెళుతున్నాయి. కానీ 1925 లో ఈ టెన్నిస్ గేమ్ ను కోర్ట్ లో కాదు ఆకాశంలో ఆడారు? అదెలా అంటారా? ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఈ గేమ్ ను గ్లాడిస్ రాయ్, ఇవాన్ ఉంగెర్‌లు 1000మీటర్ల ఎత్తులో ఎగురుతున్న రెండు […]
దిశవెబ్‌డెస్క్: వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్ లీ ఎస్ట్ గేమ్ టెన్నిస్. మట్టిలో పుట్టిన టెన్నిస్ లాంటి కాస్ట్ లీ ఎస్ట్ గేమ్ స్పోర్ట్స్ అన్నీ ఇప్పుడు మ్యాట్, సింథటిక్ కోర్ట్ లపైకి వెళుతున్నాయి. కానీ 1925 లో ఈ టెన్నిస్ గేమ్ ను కోర్ట్ లో కాదు ఆకాశంలో ఆడారు? అదెలా అంటారా? ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఈ గేమ్ ను గ్లాడిస్ రాయ్, ఇవాన్ ఉంగెర్‌లు 1000మీటర్ల ఎత్తులో ఎగురుతున్న రెండు విమానం రెక్కల్ని టెన్నిస్ కోర్ట్ గా మార్చి గేమ్ ఆడి చరిత్ర సృష్టించారు. గ్లాడిస్ రాయ్, ఇవాన్ ఉంగెర్‌లు 100సంవత్సరాల క్రితం భయంకరమైన స్టంట్స్ చేసి ఉండక పోతే ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్లమే కాదు. ఏవియేషన్ రంగం అంతలా అభివృద్ధి చెందేది కాదు.
చిన్నవయస్సులోనే ఆడ్రినలిన్ హార్మోన్ల ప్రభావం వల్ల గ్లాడిస్ రాయ్ సాహాసవంతమైన క్రీడల్ని ఆడేందుకే మక్కువ చూపించింది. ఆ మక్కువతోనే 13వ సారి ఎగురుతున్న విమానం నుంచి పారా చూట్ సాయంతో కిందకు దూకింది. అతి తక్కువగా 100 అడుగుల ఎత్తునుంచి పారాచూటింగ్ చేసి రికార్డ్ సృష్టించింది. ఆ సమయంలో అతి తక్కువ ఎత్తు నుండి పారాచూటింగ్ చేసిన మహిళగా రాయ్ ప్రపంచ రికార్డ్‌ను బద్దలు కొట్టి పేరు ప్రతిష్టలు గడించింది.
అయితే గ్లాడిస్ రాయ్ తరహాలో ఇవాన్ ఉంగెర్ అనే మహిళ ప్రమాదకరమైన స్టంట్‌లలో ఆరితేరింది. ఆమె పేరు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. కానీ 1925లో ఇవాన్ ఉంగెర్.., గ్లాడిస్ రాయ్ తో కలిసి చేసిన సాహసం.., ఇవాన్ ఉంగెర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. సైన్స్ పరిజ్ఞానం ప్రకారం 100మీటర్ పర్ అవర్ కంటే ఎక్కువ దూరం వెళ్లే బైప్‌లైన్( చిన్నరెక్కల విమానం) రెక్కలపై ఆడకూడదు. విమానం కంటే తక్కువ స్పీడుతో నడిచే బైప్ లైన్ రెక్కలపై టెన్నిస్ ఆడేలా పర్మీషన్ తీసుకున్నారు.
అదే ఏడాది ‘వింగ్ వాకర్స్’ స్టేట్ ఫెయిర్ టైప్ ఏవీయేషన్ విన్యాసాలు జరిగాయి. ఈ ఈవెంట్ లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో గాల్లో ఎగురుతున్న బైప్‌లైన్ విమానం రెక్కలపై టెన్నిస్ కోర్ట్ ను ఏర్పాటు చేసుకొని, టెన్నిస్ గేమ్ ను ఆడాల్సి ఉంది. ప్లాన్ ప్రకారం అనుకున్నట్లుగానే భూమి నుంచి 1000 అడుగుల ఎత్తులో ఉన్న బైప్ లైన్ విమానం ఎక్కారు. తమ వెంట తీసుకెళ్లిన నెట్‌ను విమానం రెక్కలకి కట్టేసి, టెన్నిస్ బాల్ తో గేమ్ ఆడారు. ఈ గేమ్ ప్రపంచ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. వాళ్లిద్దరూ చేసిన ఆ స్టంట్లే ఏవియేషన్ రంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అప్పటి వరకూ ఏవియేషన్ రంగాన్ని ఓ చిన్నచూపుచూసే వ్యాపారస్థులు.., గ్లాడిస్ రాయ్, ఇవాన్ ఉంగెర్లు ఆడిన టెన్నిస్ ఆటతో దాని స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అంతేకాదు నాటి నుంచి నేటి వరకూ అలాంటి ప్రమాదకరమైన టెన్నిస్ గేమ్ ను ఎవరూ ఆడలేదు.