రంగారెడ్డిలో డేంజర్ బెల్స్.. ఢిల్లీ నుంచి వచ్చి 10 మందికి కరోనా అంటించాడు..
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా సోకిన వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఓ అపార్ట్మెంట్‌లో ఉంటున్న పది మంది కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీరం చెరువు దగ్గర ఉన్న అపార్ట్మెంట్‌లో శనివారం వెలుగుచూసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వ్యక్తికి కరోనా సోకగా అతను అజాగ్రత్త వలన అపార్ట్మెంట్‌లో ఉంటున్న మరో పది మందికి కరోనా […]
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా సోకిన వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఓ అపార్ట్మెంట్‌లో ఉంటున్న పది మంది కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీరం చెరువు దగ్గర ఉన్న అపార్ట్మెంట్‌లో శనివారం వెలుగుచూసింది.
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వ్యక్తికి కరోనా సోకగా అతను అజాగ్రత్త వలన అపార్ట్మెంట్‌లో ఉంటున్న మరో పది మందికి కరోనా వ్యాప్తి చెందింది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో వైద్యాధికారులు ఆదివారం అపార్ట్మెంట్‌లోని ప్రతీ ఒక్కరికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.