కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. వైద్య శాఖలో తాత్కాలిక నియామకాలు

దిశ ప్రతినిధి , హైద‌రాబాద్: క‌రోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండ‌డంతో వైర‌స్ సోకిన వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్ జిల్లాలో నూత‌నంగా తాత్కాలిక పద్ధతిన నియామ‌కాలు చేప‌డుతున్నారు. ఇందుకోసం త్వరలో నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నారు. సుమారు ఏడాది కాలంగా రాష్ట్రంలో న‌మోదౌతున్న క‌రోనా కేసుల‌ను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తుండగా.. గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, టిమ్స్, ఉస్మానియా, […]

Update: 2021-04-01 08:52 GMT

దిశ ప్రతినిధి , హైద‌రాబాద్: క‌రోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండ‌డంతో వైర‌స్ సోకిన వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్ జిల్లాలో నూత‌నంగా తాత్కాలిక పద్ధతిన నియామ‌కాలు చేప‌డుతున్నారు. ఇందుకోసం త్వరలో నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నారు. సుమారు ఏడాది కాలంగా రాష్ట్రంలో న‌మోదౌతున్న క‌రోనా కేసుల‌ను నియంత్రించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తుండగా.. గాంధీ ఆస్పత్రి, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, టిమ్స్, ఉస్మానియా, నిమ్స్, నిలోఫ‌ర్‌తో పాటు ప‌లు హాస్పిట‌ల్స్‌లో కొవిడ్ రోగుల‌కు వైద్య సేవ‌లు అందిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌గా గుర్తింపు పొందిన వైద్యులు, సిబ్బంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డ్డారు. అయినా, వైద్య సేవ‌లు అందిస్తున్నప్పటికీ రోగుల తాకిడి మేర‌కు సిబ్బంది లేక‌పోవ‌డం అధికారుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం ఇటీవ‌ల పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో కూడా క‌రోనా పరీక్షలు , వైద్య సేవ‌లు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే నూత‌న నియామ‌కాలు చేపట్టనున్నారు.

తాత్కాలిక పద్ధతిలో

కొవిడ్ పరీక్షలు, వైద్యం అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖలో తాత్కాలిక పద్ధతిన నియామ‌కాలు చేపట్టనున్నారు. స్పెష‌లిస్ట్ డాక్టర్స్, మెడిక‌ల్ ఆఫీస‌ర్స్, హెడ్ న‌ర్సులు, స్టాఫ్ న‌ర్సులు, ఏఎన్ఎంలు, డీఐఓ , ల్యాబ్ టెక్నీషియ‌న్స్ త‌దిత‌ర ఉద్యోగాల‌ను త్వరలో భ‌ర్తీ చేయ‌డం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ రోగుల‌కు మ‌రింత మెరుగైన వైద్యం అందించేలా ప్రణాళికలు చేస్తున్నారు.

Tags:    

Similar News