కంటైన్మెంట్ జోన్‌ ఆలయాల్లోకి నో ఎంట్రీ

దిశ,హైద‌రాబాద్: జూన్ 8 నుంచి ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్‌పీ)పై అధికారులతో సమీక్షించారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్ల ఏర్పాటు, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో ఆలయాలను శుభ్ర పర్చడం, ప్రవేశ ద్వారం దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే […]

Update: 2020-06-05 06:32 GMT

దిశ,హైద‌రాబాద్: జూన్ 8 నుంచి ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్‌పీ)పై అధికారులతో సమీక్షించారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్ల ఏర్పాటు, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో ఆలయాలను శుభ్ర పర్చడం, ప్రవేశ ద్వారం దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే కంటైన్మెంట్ జోన్‌లలోని ఆల‌యాల్లో భ‌క్తుల‌కు ప్ర‌వేశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆల‌యాలకు వ‌చ్చే భక్తులు మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతను పరిశీలించేందుకు థర్మల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పుష్క‌రిణిలో స్నానాల‌కు అనుమ‌తి లేద‌న్నారు. అంత‌రాల‌య ద‌ర్శ‌నం, శ‌ఠ‌గోపం, తీర్థ ప్ర‌సాదాల విత‌ర‌ణ, వ‌స‌తి సౌక‌ర్యాలు ఉండ‌వ‌‌న్నారు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ సేవ‌లు య‌ధావిధిగా అందుబాటులో ఉంటాయ‌ని వెల్లడించారు. ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Tags:    

Similar News