రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కన్నా 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 3.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 3.6 డిగ్రీలు, కుమురం భీం జిల్లా గిన్నెధరిలో 3.9, హైదరాబాద్‌లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. విశాఖ ఏజేన్సీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. మినుములూరులో 7, పాడేరులో 8 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న […]
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కన్నా 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 3.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 3.6 డిగ్రీలు, కుమురం భీం జిల్లా గిన్నెధరిలో 3.9, హైదరాబాద్‌లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
విశాఖ ఏజేన్సీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. మినుములూరులో 7, పాడేరులో 8 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది.