చలికి వణుకుతున్న జనం.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రత

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి జనం వణుకిపోతున్నారు. ప్రతీ ఏడాది సాధారణంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ఈ ఏడాది మాత్రం హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం సెంట్రల్ యూనివర్సిటీలో 8.2, రాజేంద్రనగర్‌లో 9.1, బీహెచ్‌ఈఎల్‌లో 9.7, గచ్చిబౌలిలో 11.5, వెస్ట్ మారేడ్‌పల్లిలో 11.2, బండ్లగూడలో 11.8, మాదాపూర్‌లో 13.6, గోల్కొండలో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ముషీరాబాద్‌లో కాస్తంత ఎక్కువగా 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత […]

Update: 2021-12-18 22:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి జనం వణుకిపోతున్నారు. ప్రతీ ఏడాది సాధారణంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ఈ ఏడాది మాత్రం హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

శనివారం సెంట్రల్ యూనివర్సిటీలో 8.2, రాజేంద్రనగర్‌లో 9.1, బీహెచ్‌ఈఎల్‌లో 9.7, గచ్చిబౌలిలో 11.5, వెస్ట్ మారేడ్‌పల్లిలో 11.2, బండ్లగూడలో 11.8, మాదాపూర్‌లో 13.6, గోల్కొండలో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ముషీరాబాద్‌లో కాస్తంత ఎక్కువగా 14.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు.

అయితే ఉత్తర భారతంలో హిమపాతం కురుస్తున్న కారణంగా రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదై, చలి తీవ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

Tags:    

Similar News