ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమం: ఉక్రెయిన్ అధ్యక్షుడు

కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ - Zelenskyy: Russian attack is genocide

Update: 2022-04-03 17:04 GMT

కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ మారణహోమానికి పాల్పడుతుందని అన్నారు. తమ దేశంలో 100కు పైగా జాతీయతలు ఉన్నాయని అన్నారు. ఇదంతా జాతీయతలను నాశనం, ధ్వంసం చేయడమేనని అన్నారు. 'మేము ఉక్రెయిన్ వాసులం. రష్యన్ ఫెడరేషన్ విధానానికి లొంగిపోవాలనుకోవడం లేదు. అందువల్లే మేము మరింత నాశనాన్ని చూస్తున్నాం. 21వ శతాబ్దంలో యూరోప్‌లో ఇది జరుగుతుంది. ఇది జాతి మొత్తానికి హింస' అని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా మారణహోమానికి పాల్పడిందన్న వార్తలను రష్యా అధికారులు ఖండించారు. అదంతా తప్పుడు ప్రకటనలని తెలిపారు. రెచ్చగొట్టేందుకే ఉక్రెయిన్ తప్పుడు సమాచారం ఇస్తుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News