ఆయువు తీసిన కూరగాయల దొంగతనం.. ఇద్దరు యువకులు మృతి

దిశ, అందోల్ : దొంగ‌త‌నంగా కూర‌గాయాల‌ను కోసేందుకు వేళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్ త‌గిలి మృతి చెందిన సంఘ‌ట‌న

Update: 2022-03-14 09:23 GMT

దిశ, అందోల్ : దొంగ‌త‌నంగా కూర‌గాయాల‌ను కోసేందుకు వేళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్ త‌గిలి మృతి చెందిన సంఘ‌ట‌న సంగారెడ్డి జిల్లా అందోలు మండ‌లం చందంపేట శివారులో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చందంపేట‌కు చెందిన మంగ‌లి యాద‌య్య (26), చాక‌లి విఠ‌ల్ (28) ఇద్దరు దినస‌రి కూలీలుగా ప‌నిచేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన గొల్ల న‌ర్సింలు, కృష్ణల‌కు చెందిన వ్యవ‌సాయ పొలంలో సాగు చేస్తున్న కూర‌గాయాల పంట‌ను అడ‌వి పందుల బెడ‌ద నుంచి కాపాడుకునేందుకు పోలం చుట్టూ పెన్సింగ్ వైరును ఏర్పాటు చేసి క‌రెంట్ షాక్ పెట్టారు. ఇది గ‌మ‌నించ‌కుండా యాద‌య్య, విఠల్‌లు అదివారం రాత్రి కూర‌గాయాలు దొంగ‌త‌నంగా కొసేందుకు వేళ్లి, క‌రెంట్ షాక్ త‌గ‌లి మృతి చెందారు. సోమ‌వారం ఉద‌యం భూ య‌జ‌మాని కొడుకు కూర‌గాయాలు కోసేందుకు వేళ్లగా అక్కడ విగ‌త‌జీవులుగా వీరిద్దరి మృత‌దేహాలు క‌నిపించడంతో గ్రామస్థుల‌కు స‌మాచారాన్ని అందించారు. స‌ర్పంచ్ నాగిరెడ్డి పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వడంతో, సంఘ‌ట‌న స్థలానికి వేళ్లిన పోలీసులు పంచ‌నామా నిర్వహించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుడు చాక‌లి విఠ‌ల్‌కు భార్య లావ‌ణ్య, ఇద్దరు కూతుళ్లు ఉండ‌గా, మంగ‌లి యాద‌య్యకు భార్య న‌వ‌నీత, కొడుకు, కూతురు ఉన్నారు. కూర‌గాయాల కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారంటూ, బంధువులు, కుటుంబ స‌భ్యులు బోరున విల‌పిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు మృతి చెంద‌డంతో గ్రామంలో విషాద‌ఛాయాలు అలుముకున్నాయి. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News