Bhool Bhulaiyya-3: హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్న యంగ్ హీరో.. అంచనాలు పెంచుతున్న లేటెస్ట్ ట్రైలర్

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan), త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భూల్ భూలయ్యా-3(Bhul Bhulaiyaa-3).

Update: 2024-10-09 12:18 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan), త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భూల్ భూలయ్యా-3(Bhul Bhulaiyaa-3). ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని అనీస్ బజ్మీ(Anees Bazmee) తెరకెక్కించారు. అయితే ఇందులో విద్యాబాలన్(Vidya Balan), మాధురీ దీక్షిత్, విజయ్ రాజ్, అశ్విని కల్సెకర్, రాజేష్ శర్మ, సంజయ్ మిశ్రా వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే ఈ సినిమా నవంబర్ 1న దీపావళి (Diwali) కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, భూల్ భూలయ్యా-3 ట్రైలర్ విడుదలైంది. మూడు నిమిషాల యాభై సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ (Trailer) ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను పెంచుతోంది. ఆత్మల కాన్సెప్ట్‌తో పాటు కామెడీతో జనాలను కడుపుబ్బా నవ్విస్తోంది.


Full View

Tags:    

Similar News