World's Largest India Flag: ప్రపంచలోనే అతిపెద్ద భారత జాతీయ జెండా
World's Largest India Flag to Unveil in Delhi, Says Arvind Kejriwal| దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద భారత పతాకాన్ని రూపొందించనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. వేల సంఖ్యలో పిల్లలంతా కలసి వచ్చే నెల 4న జెండాను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు
న్యూఢిల్లీ: World's Largest India Flag to Unveil in Delhi, Says Arvind Kejriwal| దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద భారత పతాకాన్ని రూపొందించనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. వేల సంఖ్యలో పిల్లలంతా కలసి వచ్చే నెల 4న జెండాను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశాన్ని గొప్ప ఎత్తులకు తీసుకెళ్లేందుకు అందరూ ముందుకు రావాలని గురువారం ఆయన పిలుపునిచ్చారు. అయితే దేశంలో అన్ని సహజ వనరులున్నప్పటికీ, గత 75 ఏళ్లలో అనేక దేశాలు భారత్‌ను అధిగమించాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత తెలివైనవారు భారతీయులేనని, కాకపోతే రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు వదిలేస్తే దేశం వెనుకబడి పోతుందని అన్నారు. 130 కోట్ల మంది జనం భారత్‌ను ప్రపంచంలోనే ఉత్తమ దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, ఉద్యోగులు ఏకమైతే భారత్ ప్రపంచాన్ని నడిపించే స్థాయికి ఎదుగుతుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌ను శాంతి జోన్‌గా ప్రకటించండి : పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ