వరల్డ్ రెయిన్‌ఫారెస్ట్ డే.. వర్షారణ్యాల సంరక్షణకు ఏం చేయాలి?
దిశ, ఫీచర్స్ : ప్రతి ఏటా జూన్ 22న ‘వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే’ జరుపుకుంటారు. రెయిన్ ఫారెస్ట్‌లను సంరక్షించి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. నిజానికి భూమిపై అత్యంత విలువైన వనరుల్లో రెయిన్ ఫారెస్ట్‌లు ఒకటిగా పరిగణించబడుతున్నాయి..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ప్రతి ఏటా జూన్ 22న 'వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే' జరుపుకుంటారు. రెయిన్ ఫారెస్ట్‌లను సంరక్షించి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. నిజానికి భూమిపై అత్యంత విలువైన వనరుల్లో రెయిన్ ఫారెస్ట్‌లు ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే ఒక్క అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ నుంచే మనం పీల్చే ఆక్సిజన్‌లో 20 శాతం సరఫరా అవుతోంది. వైవిధ్యమైన మందులు, చికిత్సలకు ఉపయోగకరమైన మూలికా ఔషధాలకు కూడా ఇదే వనరు. కాఫీ, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలు సహా రోజువారీ వినియోగ ఉత్పత్తులకు మూలం. అందుకే అనేక సంస్థలు, పర్యావరణ ఔత్సాహికులు, NGOలు సహజ వనరులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.
రెయిన్ ఫారెస్ట్‌ల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు :
* ఈ దిశగా పనిచేస్తున్న సంస్థలకు మద్దతు తెలపడం
ప్రపంచంలోని వర్షారణ్యాలను రక్షించే దిశగా అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి సాయం చేయడం, మద్దతివ్వడం మనం చేయాల్సిన మొదటి పని. ఈ మేరకు విరాళాలు ఇవ్వడం లేదా దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం ద్వారా ఆయా సంస్థలకు సాయం చేయొచ్చు.
* కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడం
కార్బన్ ఫుట్ ప్రింట్(గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు)ను అంతానికి లేదా కనీసం తగ్గించేందుకైనా ప్రయత్నించాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను వీలైనంత తక్కువగా ఉపయోగిస్తూ పబ్లిక్ వాహనాల్లో ప్రయాణించడం లేదా సైకిల్ వినియోగాన్ని పెంచాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిసరాల్లో ఎక్కువ మొక్కలు నాటాలి.
* మాంసంలేని భోజనం తీసుకోవడం
పశువుల పెంపకం చాలా వరకు అటవీ నిర్మూలనకు దారితీస్తుంది. వాటికి కావలసిన పశుగ్రాసాన్ని సాగు చేసే ప్రయత్నంలో అనేక రెయిన్‌ఫారెస్ట్‌లు నాశనమవుతాయి.
* తిరిగిచ్చే ఉత్పత్తులు ఎంచుకోవాలి
వస్తువుల కొనుగోలు తగ్గించడం ఉత్తమం. మనం చేసే ప్రతి కొనుగోలుతో వివిధ పర్యావరణ కారణాల కోసం విరాళాలు ఇస్తున్న కంపెనీలు ఉన్నాయి. అటువంటి బ్రాండ్లతో అనుబంధం పొందడం మంచిది.
* బాధ్యతాయుతమైన ఉత్పత్తులే కొనుగోలు చేయాలి
చాలా కంపెనీలు బాధ్యతాయుత అవసరాలతో రూపొందించిన లేదా రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులనే విక్రయిస్తాయి. ఇటువంటి ఉత్పత్తులు ఉష్ణమండల అటవీ నిర్మూలనను అరికట్టేందుకు ప్రముఖ పాత్ర పోషించగలవు.