World Health Day: ప్రపంచం ఆరోగ్య దినోత్సవం.. స్పెషల్
దిశ, వెబ్‌డెస్క్ : 1948, ఏప్రిల్ 7న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్లూహెచ్‌వో)' ఏర్పాటైంది.
దిశ, వెబ్‌డెస్క్ : 1948, ఏప్రిల్ 7న ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 'వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్లూహెచ్‌వో)' ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో 1950 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజారోగ్య సమస్యలపై వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ప్రతీ సంవత్సరం ఒక థీమ్‌ను ఎంపిక చేసే డబ్ల్యూహెచ్‌వో.. గతేడాది కరోనా నేపథ్యంలో 'అందరికీ ఆరోగ్యం' అనే సందేశంతో ముందుకొచ్చింది. ఇక ఈ ఏడాది 'మన గ్రహం- మన ఆరోగ్యం' థీమ్‌ను ఎంపిక చేయగా.. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని వైద్య నిపుణులు పిలుపునిస్తున్నారు. మారుతున్న అలవాట్లతో కంటినిండా నిద్ర, పోషకాహారం కరువైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున మంచి అలవాట్లను అలవర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞచేయాలని పిలుపునిచ్చారు.