శాయంపేటలో ఘనంగా మహిళ బంధు సంబరాలు..

దిశ, శాయంపేట: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ మహిళ-latest Telugu news

Update: 2022-03-06 12:34 GMT

దిశ, శాయంపేట: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి 6,7,8 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా బంధు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంత్రి పిలుపు మేరకు.. హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలో మహిళలు కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన మహిళలను వరంగల్ జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైస్ ఎంపీపీ లతా లక్ష్మా రెడ్డి, సర్పంచ్ అబ్బు ప్రకాశ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శరత్, మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్, కో ఆప్షన్ సభ్యులు మోహినుద్దీన్, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News