బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో అబ్బురపరిచే హెలికాప్టర్ల విన్యాసాలు

దిశ, బేగంపేట : ఆకాశ మార్గంలో రయ్ మంటూ దూసుకు వెళ్లే విమానాలను అతి దగ్గరగా చూడడం తో ఒక్కసారిగా latest telugu news..

Update: 2022-03-26 15:33 GMT
బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో అబ్బురపరిచే హెలికాప్టర్ల విన్యాసాలు
  • whatsapp icon

దిశ, బేగంపేట : ఆకాశ మార్గంలో రయ్ మంటూ దూసుకు వెళ్లే విమానాలను అతి దగ్గరగా చూడడం తో ఒక్కసారిగా సంబరంలో నగర ప్రజలు మునిగిపోయారు. ముఖ్యంగా చిన్నారులు డాడీ ఏరోప్లేన్.. మమ్మీ హెలికాప్టర్ అంటూ ముద్దు ముద్దుగా చిన్నారులు ఆ విమానాలను చూపిస్తూ మురిసిపోయారు. ఆకాశంలో వెళుతున్న విమానాలను చూడడమే తప్ప దగ్గరగా చూసే అవకాశం లేని సాధారణ ప్రజలకు శనివారం అవకాశం లభించింది. రూ.590 టికెట్ కొనుగోలు చేసుకుని మరీ ఆ మధురానుభూతిని ఆస్వాదించారు. కుటుంబంతో సహా వచ్చి అతి సమీపం నుంచి ఆ విమానాలను చూస్తూ గంతులేశారు. వింగ్స్ ఇండియా ఏవియేషన్ షోను తిలకించేందుకు నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు తరలిరావడంతో ఎయిర్పోర్టు అంతా సందర్శకులతో కిక్కిరిసిపోయింది.

గత మూడు రోజులుగా బిజినెస్..

సందర్శకులకు మాత్రమే ప్రవేశం లభించడంతో సాధారణ సందర్శకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు. శనివారం ఉదయం నుండే బేగంపేట ఎయిర్‌పోర్ట్ వైపు పరుగులు తీశారు. రూ.590 ఎంట్రీ ఫీజు కొనుగోలు చేసుకున్న వారు షోను తిలకించేందుకు తరలివచ్చారు. ఆకాశంలో అదిరిపోయిన హెలికాప్టర్‌ల వివ్యాసాలు, ఎయిర్ షో మొత్తంలో సామాన్య వీక్షకులకు అంతగా నచ్చింది. కేవలం హెలికాప్టర్‌ల విన్యాసాలు మాత్రమే శనివారం ఉదయం, సాయంత్రం ఆకాశంలో హెలికాప్టర్‌ల విన్యాసాలు అబ్బురపరిచాయి.

మూడు హెలికాపర్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. కిందకు పైకి వెళ్తు.. మరోసారి పొగలు వదులుతూ.. ఒకటిని మరోకటి ఢీ కొట్టుకుంటయేమో అనేలా విన్యాసాలు జరిగాయి. మూడు హెలికాప్టర్లు దగ్గరకు రావడం, మళ్లీ దూరంగా వెళ్లడం ఇలా ఆ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు అదరహో అన్పించాయి. ముఖ్యంగా ఈ షో చిన్నారులకు భలే వచ్చింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎయిర్బస్, హెలికాప్టర్, చిన్న విమానాలు ఆదివారం చివరి రోజు సాయంత్రం వరకు ఎయిర్ షో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Tags:    

Similar News