శృంగారం తర్వాత పురుషులకు ఎందుకు నిద్రొస్తుంది?
దిశ, ఫీచర్స్ : పార్ట్‌నర్స్ మధ్య శృంగారం తర్వాత దాదాపు పురుషులందరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇది మెళకువతో ఉన్న మహిళా భాగస్వామికి అసహనం కలిగించవచ్చు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : పార్ట్‌నర్స్ మధ్య శృంగారం తర్వాత దాదాపు పురుషులందరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇది మెళకువతో ఉన్న మహిళా భాగస్వామికి అసహనం కలిగించవచ్చు. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణముందని, ఇది మెదడులోని రసాయనాలకు సంబంధించినదని నిపుణులు పేర్కొంటున్నారు. బెడ్‌పైనే మెజారిటీ సెక్స్ జరుగుతుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, శరీరం దీనిని నిద్రతో అనుబంధిస్తుందని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. సెక్స్ సమయంలో మెదడు 'నోర్‌పైన్‌ఫ్రైన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, నైట్రిక్ ఆక్సైడ్(NO), హార్మోన్ ప్రోలాక్టిన్' సహా బ్రెయిన్ కెమికల్స్‌తో కూడిన కాక్‌టైల్‌ను విడుదల చేస్తుంది. ప్రోలాక్టిన్ అనేది లైంగిక సంతృప్తి భావనతో ముడిపడి ఉంది. పురుషులు మళ్లీ సెక్స్‌కు సిద్ధమయ్యే 'రికవరీ టైమ్'కు కూడా ఇదే కారణం. అంతేకాదు నిద్రలోనే కాక సెక్స్ టైమ్‌లోనూ ఈ ప్రోలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే పార్ట్‌నర్‌తో సెక్స్ తర్వాత తరచూ నిద్రపోయే పురుషులు.. హస్తప్రయోగం తర్వాత మాత్రం ఎందుకు అలాంటి ఫీలింగ్ అనుభవించరో కూడా ప్రోలాక్టిన్ వివరిస్తుంది.
స్వయంతృప్తితో అనుభవించిన భావప్రాప్తి కంటే భాగస్వామితో శృంగారం తర్వాత పొందిన భావప్రాప్తి.. నాలుగు రెట్లు ఎక్కువ ప్రోలాక్టిన్‌ను విడుదల చేస్తుంది. కానీ ఇందుకు గల ఖచ్చితమైన కారణం శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. ఇక భావప్రాప్తి సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ కూడా నిద్రతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే పురుషుల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉండేందుకు ఒక కారణముంది. సెక్స్‌లో పాల్గొనప్పుడు కండరాల్లో శక్తిని ఉత్పత్తి చేసే గ్లైకోజెన్ తగ్గుతుంది. స్త్రీలు పురుషుల కంటే తక్కువ కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు కాబట్టి సెక్స్ తర్వాత వారు అలసిపోయే అవకాశం తక్కువ.
ఇవి కూడా చదవండి :
భర్త కోరిక మేరకు.. బాలికను గదిలోకి తోసి ఆపై నీచానికి ఒడిగట్టిన భార్య
రేప్ చేస్తుండగా ప్రతిఘటించడంతో ఆ రెండింటిపై పొడిచిన కామాంధుడు