సేంద్రీయ సాగుకు తీసుకున్న చర్యలేంటీ? లోక్‌సభలో టీఆర్ఎస్ ప్రశ్న
దిశ, తెలంగాణ బ్యూరో : సేంద్రీయ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని టీఆర్ఎస్.. Latest Telugu News..
దిశ, తెలంగాణ బ్యూరో : సేంద్రీయ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాల వారీగా సేంద్రీయ సాగులో కేంద్రం తీసుకున్న చర్యలను తెలపాలని సోమవారం లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. 2020-21 నుంచి కేంద్ర ప్రభుత్వం భారతీయ ప్రకృతి కృషి పద్దతి(బీపీకేపీ) స్కీం, పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్ని క్షేత్రస్థాయిలో 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో రసాయనరహిత సాగు చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వర్మికాంపోస్టు, పశు వ్యర్థాలతో భూమికి సారవంతమైన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. హెక్టార్‌కు రూ. 12,200 ఆర్థిక సాయం అందజేస్తూ స్థానికంగా సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తున్నామని వివరించారు.