Promissory Note:ప్రామిసరీ నోటు అంటే ఏమిటి.. అప్పు చెల్లించకపోతే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు..!

‘ప్రామిసరీ నోట్(Promissory Note) అనేది ఒక పక్షం (నోటు జారీ చేసేవారు లేదా తయారీదారు) మరొక పక్షానికి (నోటు చెల్లించే వ్యక్తి) డిమాండ్‌పై లేదా నిర్దిష్ట భవిష్యత్ తేదీలో నిర్దిష్ట మొత్తంలో డబ్బును చెల్లిస్తానని వ్రాసిన వాగ్దానాన్నే’ ప్రామిసరీ నోట్లు అంటారు.

Update: 2024-10-28 03:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రామిసరీ నోట్(Promissory Note) అనేది ఒక పక్షం (నోటు జారీ చేసేవారు లేదా తయారీదారు) మరొక పక్షానికి (నోటు చెల్లించే వ్యక్తి) డిమాండ్‌పై లేదా నిర్దిష్ట భవిష్యత్ తేదీలో నిర్దిష్ట మొత్తంలో డబ్బును చెల్లిస్తానని వ్రాసిన వాగ్దానాన్నే’ ప్రామిసరీ నోట్లు అంటారు. ప్రామిసరీ నోట్లు ఎక్కువగా గ్రామాల్లో ఉపయోగిస్తారు. వ్యవసాయం(agriculture) పనులకోసం గ్రామాల్లోని వ్యక్తులు అవసరాల కోసం లేదా ఏదైనా అత్యవసరమైనప్పుడు ఇతరుల దగ్గర వడ్డీ(interest)కి తెచ్చుకుంటారు. ఈ ప్రామిసరీ నోట్‌లో వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, నోటు చెల్లుబాటు అయ్యే తేదీ మరిన్ని వివరాలు ఉంటాయి.

ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి అప్పు తీసుకున్నప్పుడు ఈ నోట్‌పై సంతకం(signature) చేసి.. సాక్ష్యుల సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బు(money) తీసుకున్న పర్సన్ సరైన సమయానికి చెల్లించకపోతే కోర్టు(Court)లో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్టుకు డిఫాల్ట్ సాక్ష్యాన్ని అందించాక.. నోట్ చెల్లు బాటు అయ్యిందని ప్రూవ్ అయ్యాక డబ్బు కట్టని వ్యక్తిని కోర్టు విచారణకు హాజరవ్వమని నోటీసులు పంపుతుంది. ఈ సమస్యను కొంతమంది కోర్టు వరకు వెళ్లకుండా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. ఎలాంటి గొడవ పడకుండా స్నేహపూర్వకం(friendly)గా సాల్వ్ చేసుకుంటారు.

ప్రామిసరీ నోటు చట్టపరంగా ఆమోదయోగ్యత(acceptability)ను పొందటానికి ఉండాల్సిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పామిసరీ నోటు రాతపూర్వకం(in writing)గా ఉండాలి. అప్పు తీసుకునే వారి పేర్లు క్లారిటీగా ఉండాలి. షరతులు లేకుండా ఉండాలి. మనం డబ్బు ఎవరికి ఇస్తున్నామో.. ఇచ్చే వార్ల పేర్లు, ప్రామిసరీ నోటు రాసిన ప్లేస్ (Place), తేదీలు కూడా క్లారిటీగా రాయాలి. అప్పుగా ఎంత డబ్బు ఇచ్చామో అంకెల్లో రాయాలి. అలాగే అక్షరాల్లో కూడా రాయాలి. తర్వాత రెవెన్యూ స్టాంప్(Revenue stamp) అంటించాలి. ఇరుపక్షాల వారు సంతకాలు చేయాలి. వీరితో పాటుగా సాక్ష్యుల సంతకాలు.. అలాగే వారి వివరాలు కూడా ఉండటం బెటర్. అంతేకాకుండా ఈ ప్రామిసరీ నోటులో డబ్బు చెక్కు ద్వారా ఇచ్చారో.. లేదా నగదు ఇచ్చారో కూడా రాయాలి. చివర్లో ప్రామిసరీ నోటులో పోస్టాఫీసు(post office) జారీ చేసిన రెవెన్యూ స్టాంప్‌లను అతికించాలి. 

Tags:    

Similar News