కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ స్టాఫ్‌కు 'వెయిటేజ్'
వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ స్టాఫ్‌కు కూడా వెయిటేజ్ఇవ్వాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ స్టాఫ్‌కు కూడా వెయిటేజ్ఇవ్వాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నది. దీంతో ఇన్నాళ్లు ప్రభుత్వ దవాఖాన్లలో సేవ చేసిన సిబ్బందికి సర్కార్ కొలువులు పొందేందుకు సులువుగా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అయితే చట్ట పరమైన చిక్కులు లేకుండా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి వెయిటేజ్ మార్కులను నిర్ణయిస్తామని సెక్రటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఖాళీ పోస్టులను రెండు విడతల్లో నింపనున్నారు.
ఫస్ట్‌ఫేజ్‌లో డాక్టర్, ఏఎన్ఎం, నర్సింగ్, సెకండ్ ఫేజ్‌లో పారమెడికల్, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం పది రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నియామకాలకు సంబంధించినఅన్ని ఏర్పాట్లను కూడా రెడీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్లకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
బోర్డు ద్వారా పది వేలు పోస్టులు భర్తీ..
ఆరోగ్యశాఖలోని ఖాళీలను ఈ సారి మెడికల్ రిక్రూట్‌మెంట్‌బోర్డు, టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఆఫీసర్లు ఫ్లాన్చేస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ విభాగాల్లో 12,735 పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిల్లో 10,028 పోస్టుల భర్తీ బాధ్యతలను స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ప్రభుత్వం అప్పగించింది. ఇందులో 4661 స్టాఫ్ నర్స్, 1183 అసిస్టెంట్ ప్రొఫెసర్, 357 ట్యూటర్, 1785 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫీమేల్), 758 సివిల్ అసిస్టెంట్ సర్జన్(ఎంబీబీఎస్), 1284 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు ఉన్నాయి. ఇవిగాక మరో 2662 పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్‌కి అప్పగించారు. ఇందులో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లోని స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మెడికల్ ఆఫీసర్, లెక్చరర్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర 689 పోస్టులు ఉన్నాయి.
మూడు విభాగాల్లో ఇలా...
మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1118 పోస్టులు ఉండగా, ఇందులో అత్యధికంగా గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 356, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ 161, జూనియర్ అసిస్టెంట్ 172, అనస్తేషియా టెక్నీషియన్ 93, డెంటల్ టెక్నీషియన్ 53, రేడియోగ్రాఫర్ 55 పోస్టులు ఉన్నాయి. మిగిలిన కేడర్లలో పదుల సంఖ్యలో మాత్రమే ఖాళీలు ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ 160, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ 119, జూనియర్ అసిస్టెంట్ 46, డార్క్ రూమ్ అసిస్టెంట్ 30, మలేరియా ఆఫీసర్ 2 పోస్టులు ఉన్నాయి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ర్టేషన్ పరిధిలో మొత్తం 33 పోస్టులు ఉండగా.. ఇందులో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, 6 జూనియర్ అసిస్టెంట్, 9 జూనియర్ అనలిస్ట్ పోస్టులున్నాయి.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో 56 పోస్టులు ఉండగా, ఇందులో అత్యధికంగా 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌లో 68, నిమ్స్‌లో 20 జూనియర్ అసిస్టెంట్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో 13, టీవీవీపీ పరిధిలో 301, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో 7 పోస్టులకు ప్రభుత్వం నుంచి పర్మిషన్లు కూడా వచ్చాయి. నిమ్స్‌లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను డిపార్ట్‌మెంట్ సెలక్షణ్ కమిటీ ద్వారా మాత్రమే భర్తీ చేయనున్నారు.