మండలాల వారీగా ఫైర్స్టేషన్లు ఏర్పాటు చేస్తాం
మండలాల వారీగా ఫైర్స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని
దిశ, తెలంగాణ బ్యూరో : మండలాల వారీగా ఫైర్స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి మహముద్ అలీ పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో సభ్యులు క్రాంతి కిరణ్చంటి, ఎస్.రాజేందర్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఫైర్స్టేషన్లను పెంచామన్నారు. దీంతో పాటు అన్ని పోలీస్స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. పోలీస్‌కమిషనర్, సూపరింటెండెంట్, సబ్ డివిజనల్పోలీసు కార్యాలయం, ఇన్స్పెక్టర్లతో పాటు పోలీస్స్టేషన్లు, ఇతర కార్యాలయాల కోసం ఆధునిక భవనాలను నిర్మించి, ఆధునిక టెక్నాలజీ చర్యలను అమలు చేస్తున్నామన్నారు. సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి బహుమతులు కూడా ఇస్తున్నామన్నారు.