వివాదాలకు ఫుల్‌స్టాఫ్ భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాక్ పేర్లు పక్కపక్కన వస్తేనే వివాదానికి తెరలేస్తుంది. ఇరు దేశాలు ఎప్పుడూ ఒకరిపై

Update: 2022-04-02 11:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాక్ పేర్లు పక్కపక్కన వస్తేనే వివాదానికి తెరలేస్తుంది. ఇరు దేశాలు ఎప్పుడూ ఒకరిపై మరొకరు కత్తులు రువ్వుకుంటుంటారు. దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ క్వామర్ జావేద్ బజ్వ చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. భారతీయులు సైతం నివ్వెరపోయారు. జావేద్ మాటలకు అందరూ నోర్రెళ్లబెట్టారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆఫీసరేనా మాట్లాడుతుంది అనుకున్నారు. ఇస్లామాబాద్ సెక్యూరిటీ డైలాగ్ చివరి రోజు సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. 'ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వివాదాలతో అట్టుడుకుతోంది. కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతుంటే మరికొన్ని ప్రదేశాల్లో భారీ ఎత్తున సంఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి' అన్నారు.

'ఈ పరిస్థితుల్లో ఇటువంటి వివాదాలకు పాకిస్తాన్ దూరంగా ఉండటమే మంచిది. అందులో భాగంగానే భారత్‌తో ఉన్న వివాదాలకు చర్చల ద్వారా శాంతియుతమైన ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నాం. చర్చలకు భారత్ ఒప్పుకుంటే కాశ్మీర్ వివాదానికి కూడా స్వస్తి పలుకుతాం' అని జావేద్ అన్నారు. దీంతో పాటుగా పాకిస్తాన్ విదేశాంగ విధానం స్వాతంత్రంగా ఉంటుందని తాను నిర్ణయించుకున్నానని, అంటే పాకిస్తానీలు ఎవరికీ శత్రువులు, పాకిస్తానీలకూ ఎవరూ శత్రువులు కాదని ఆయన చెప్పుకొచ్చారు. మరి పాక్‌తో చర్చలకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News