నా మొత్తం క్రికెట్ కెరీర్‌లో ఆ 35 పరుగులే అత్యంత ముఖ్యమైనవి: Virat kohli
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో ఏప్రిల్ 2 చారిత్రాత్మక రోజు.. 2011 వరల్డ్ కప్‌లో -Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో ఏప్రిల్ 2 చారిత్రాత్మక రోజు.. 2011 వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయకేతనం ఎగరవేసి రెండవ సారి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. సరిగ్గా 11ఏళ్ల క్రితం ఇదే రోజున భారత్ బ్యాటర్ల అద్భుత ఇన్నింగ్స్‌లు నేటికీ క్రికెట్ ప్రేమికుల కళ్లేదుటే మెదులుతున్నాయి. గంభీర్(97) అద్భుత ఇన్నింగ్స్.. మహేంద్ర సింగ్ ధోని చిరస్మరణీయ విన్నింగ్ షాట్‌ను నేటికి క్రికెట్ అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. 28ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ ధోని సారథ్యంలోని టీమిండియా రెండవ సారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది.
కాగా, 2011 వరల్డ్ నాటి జ్ఞాపకాలను టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 'సచిన్, సెహ్వాగ్ వంటి స్టార్ క్రికెటర్లు ఔట్ అయ్యాక.. టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది.. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్ దిగి గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాను. ఆ మ్యాచ్‌లో నేను 35 పరుగులు చేశాను. నా మొత్తం క్రికెట్ కెరీర్‌లోనే ఆ 35పరుగులే నాకు అత్యంత ముఖ్యమైనవి. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తీవ్ర ఒత్తిడిలో వరల్డ్ కప్ గెలిచాం. టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆ ప్రాంతమంతా వందేమాతరం గేయంతో ప్రతిధ్వనించింది. ఆ శబ్దాలు నేటికి నా చెవుల్లో మారుమోగుతున్నాయని' తన ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.