CM Dance Video: సంప్రదాయ నృత్యం చేసిన సీఎం.. వీడియో వైరల్

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఓ హోదాలో ఉండి ఎక్కడైనా డాన్స్ చేస్తే వారిపై విమర్శల గుప్పిస్తారు. అంతటి హోదాలో ఉండి..

Update: 2022-04-22 12:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: CM Dance Video| సాధారణంగా ఓ హోదాలో ఉండి ఎక్కడైనా డాన్స్ చేస్తే వారిపై విమర్శల గుప్పిస్తారు. అంతటి హోదాలో ఉండి ఇలా ఎలా చేస్తారు, సిగ్గుగా లేదా అంటూ విరుచుకుపడతారు. అటువంటిది ఓ ముఖ్యమంత్రి ప్రజలతో కలిసి డాన్స్ చేస్తే. అవును.. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమ కందు ఓ పండుగ సందర్భంగా అక్కడి ప్రజలతో కలిసి డాన్స్ చేశారు. అంతేకాకుండా దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. అస్సామీ కమ్యూటీకి చెందిన ఇటానగర్‌లో జరిగిన బిహు పండుగలో పాల్పంచుకున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. 'మా నివాసం దగ్గర నిర్వహించిన బిహు పండుగలో భాగమయ్యాను. పండుగ అద్భుతంగా జరిగింది. ఈ పండుగ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మధ్య ఉన్న పురాతన సాంస్కృతిక బంధానికి మరింత బలం చేకూరుస్తోంది. ఇటువంటి పండగల స్ఫూర్తి ఎన్నటికీ తగ్గదు' అంటూ పేమ కందు రాసుకొచ్చారు. ఈ పండుగ సంబరాల్లో పాల్గొన్న పేమ కందు సాంస్కృతిక నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News